బన్నీ వాస్ నూతన నిర్మాణ సంస్థ బి.వి. వర్క్స్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మిత్ర మండలి’. అభిరుచి గల నిర్మాతలు కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంతో సోషల్ మీడియా సంచలనం నిహారిక ఎన్.ఎం. తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. నూతన దర్శకుడు విజయేందర్ ఎస్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు.
Also Read : Allu Aravind: ఫేక్ ఐడీతో ఈ హీరోయిన్ ను ఫాలో అవుతున్నా!
ఇక ఈ లాంచ్ కార్యక్రమంలో ముఖ్య అతిథి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ “బన్నీ వాసు సమర్పిస్తున్న మొదటి సినిమాగా, నా మిత్రులందరూ కలిసి తీసిన ఈ ‘మిత్ర మండలి’ టీజర్ ను లాంచ్ చేయడం నా బాధ్యతగా భావిస్తున్నాను. నేను యంగ్ స్టర్స్ తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటా. దాని వల్ల స్క్రిప్ట్ ఎంపిక వంటి విషయాల్లో ఎంతో హెల్ప్ జరుగుతుంటుంది. ఒకసారి వాసు ఈ కథ వినమని దర్శకుడిని నా దగ్గరకు పంపించాడు. కానీ, మీ ముందు కథ చెప్పలేకపోతున్నాను అని దర్శకుడు పారిపోయాడు.
Also Read : Air India: అహ్మదాబాద్‌లో కూలిన ఎయిరిండియా విమానం
నేను కథ వినకుండానే, నేరుగా ఈ సినిమా చూడబోతున్నాం. వీరందరి మాటలు వింటుంటే.. దర్శకుడిలో ఎంతో ప్రతిభ ఉందని అర్థమవుతోంది. ప్రియదర్శి మాకు ఒక వెబ్ సిరీస్ చేశాడు. అప్పుడే అనిపించింది, ఇతను మంచి స్థాయికి వెళ్తాడని. యాక్టర్ గా ఎంత చేయాలో, ఎంత చేయకూడదో తెలిసిన మనిషి. కోర్ట్ సినిమాలో అద్భుతంగా నటించాడు. సోషల్ మీడియాలో నిహారికకు మంచి ఫాలోయింగ్ ఉంది. తనకి ఆల్ ది బెస్ట్. నిర్మాతలతో నాకు మంచి అనుబంధం ఉంది. టీజర్ చాలా బాగుంది. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకంటూ, చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్.” అన్నారు.