ఏపీలో ప్రస్తుతం సనాతన ధర్మం, లడ్డూ వ్యవహారం హాట్ టాపిక్ మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షులు, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల ‘ప్రాయశ్చిత్త దీక్ష’ చేపట్టిన సంగతి విదితమే.ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ కానక దుర్గ అమ్మవారి మెట్లు స్వయంగా కడిగి మెట్ల పూజ నిర్వహించారు. పవన్ చేపట్టిన దీక్షకు మద్దతుగా పలువురు జనసేన కార్యకర్తలు దీక్ష పునారు. ఆ సమయంలో వారు తిరుమల స్వామి వారి మంత్రాన్ని జపించేందుకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం. ఎం. కీరవాణి ఆడియోను రూపొందించారు.
Also Read : Ram Charan : గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. త్వరలో ప్రకటన..?
అందుకు కృతఙ్ఞతలు తెలియజేస్తూ లేఖ విడుదల చేసారు పవన్ కళ్యాణ్. ఆ లేఖలో పవన్ ” శ్రీ కీరవాణి గారికి ధన్యవాదాలు ‘ఓం నమో నారాయణాయ’ మంత్రాన్ని ప్రజానీకం పఠించేందుకు అనువుగా ఆడియో రికార్డు రూపొందించిన ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ ఎం. ఎం. కీరవాణి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. తిరుమల మహా ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం భక్తి భావం కలిగిన ప్రతి ఒక్కరికీ తీవ్ర ఆవేదన కలిగించింది. ఈ ఆవేదన నుంచే ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించాను. ఈ దీక్షకు సంఘీభావంగా జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులతోపాటు ధార్మిక విశ్వాసాలు కలిగినవారందరూ ఆలయాల్లో పూజలు, హోమాలు, భజనలు చేస్తున్నారు. వారంతా ఓం నమో నారాయణాయ మంత్రం పఠిస్తున్నారు. అందుకు అనువుగా శ్రీ కీరవాణి గారు ఆడియో రికార్డు చేశారు. భక్తి భావంతో సాగింది. ఇందులో భాగం పంచుకున్న సంగీత కళాకారులకి, సాంకేతిక నిపుణులకి ధన్యవాదాలు. ధర్మో రక్షతి రక్షితః ” అని పేర్కొన్నారు.