ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ ఎంత బిజీగా ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యనే హరిహర వీరమల్లు షూటింగ్‌తో పాటు ఆ సినిమాకి సంబంధించిన డబ్బింగ్ వరకు కూడా పూర్తి చేసిన ఆయన, ప్రస్తుతానికి ఓజీ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. తనకు ఏ మాత్రం గ్యాప్ దొరికినా వెంటనే ముంబై వెళ్లి ఓజీ షూట్‌లో భాగమవుతున్నాడు. ఇక వచ్చే వారం చివరి వరకు ముంబైలోనే ఈ ఓజీ షెడ్యూల్ ప్లాన్ చేశారు.
Also Read:Rakul: రకుల్ ప్రీత్‌కి హైదరాబాద్‌లో ఇల్లు గిఫ్ట్.. ఫైనల్లీ ఓపెనయ్యిందిగా!
తర్వాత ఒక షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం కాబోతోంది. అయితే నిజానికి పవన్ కళ్యాణ్ ఇప్పుడు డేట్స్ సర్దుబాటు చేయడమే చాలా కష్టమైన పనిగా మారిపోయింది. ఓజీ టీమ్ మాత్రం మరో వారం రోజులు ఎక్స్ట్రా డేట్స్ సంపాదించినట్లు తెలుస్తోంది. మరో ఎక్స్ట్రా సీక్వెన్స్ ప్లాన్ చేశారని, దాని కోసమే పవన్ కళ్యాణ్‌ను ఒప్పించి మరో వారం రోజులు డేట్స్ సంపాదించారని తెలుస్తోంది. ఈ సీక్వెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుందని చెబుతున్నారు.
Also Read:Dhanush: ధనుష్ తో మరో సినిమా లైన్లో పెట్టిన వెంకీ అట్లూరి?
సుజీత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని డి.వి.వి. దానయ్య, డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక హరిహర వీరమల్లు సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా ఓజీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి అందులో నిజం ఎంతో, షూటింగ్ పూర్తి అయితే కానీ చెప్పలేని పరిస్థితి.