Site icon NTV Telugu

OG Shooting: OG షూటింగ్లో పవన్ స్టన్నింగ్ లుక్

Pawan Kalyan

Pawan Kalyan

ఒకపక్క రాజకీయాలతో బిజీగా గడుపుతున్న పవన్ కళ్యాణ్ మరోపక్క సినిమాల మీద కూడా ఫోకస్ పెట్టారు. ఆయన రాజకీయాల్లో బిజీ అవ్వకముందు మొదలుపెట్టిన సినిమాలను ఇప్పుడు పూర్తి చేసి రిలీజ్ చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఆయన హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి చేశారు. ఆ సినిమా వచ్చే నెల 12వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇక ఇప్పుడు ఆయన ముంబైలో ఓజీ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

Also Read:Sandeep vs Deepika: స్పిరిట్ పంచాయతీలో తప్పెవరిది? బలైంది ఎవరు?

డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద డివివి దానయ్య నిర్మాతగా, సుజిత్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇక ఓజీ షూటింగ్ నుంచి లీక్ అయిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో పవన్ కళ్యాణ్‌ను బౌన్సర్లు తీసుకెళ్లి కార్ ఎక్కిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అందులో వింటేజ్ బెల్‌బాటమ్ ప్యాంట్ ధరించిన పవన్ కళ్యాణ్ లుక్ అదిరిపోయిందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

Also Read:CM Revanth Reddy: కులం వల్ల ఎవరికి సమాజంలో గుర్తింపు రాలేదు..

ఇక ఈ సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్. నిజానికి పవన్ కళ్యాణ్ చేస్తున్న అన్ని సినిమాలలో ఈ సినిమా మీదనే అభిమానులలో విపరీతమైన ఆసక్తి నెలకొంది. సుజిత్ స్టైలిష్‌గా పవన్ కళ్యాణ్‌ని చూపిస్తూ ఉండడం, సినిమా లైన్ కూడా ఆసక్తికరంగా అనిపిస్తూ ఉండడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

Exit mobile version