పహల్గాం టెర్రర్ ఎటాక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నలుగురు టెర్రరిస్టులు కాశ్మీర్‌లోని పహల్గాం ఏరియాలో ఒక లోయను టార్గెట్‌గా చేసుకుని సుమారు 28 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఐడీ కార్డులు చెక్ చేసి మరి ముస్లిమేతరులను కాల్చి చంపిన ఘటన దేశవ్యాప్తంగా కల్లోలం రేకెత్తిస్తోంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ అంశంలోకి ప్రభాస్ హీరోయిన్ అనూహ్యంగా చిక్కుకుంది. అసలు విషయం ఏమిటంటే, ప్రభాస్ హీరోగా, హను రాఘవపూడి డైరెక్టర్‌గా ఒక సినిమాలో ఇమాన్వి అనే అమ్మాయి హీరోయిన్‌గా నటిస్తోంది.
Nani: ఈవెంట్లో ‘నాని’కి కథ ఇచ్చిన కేరళ యువకుడు!
ఆమెకు పాకిస్తాన్ మూలాలు ఉన్నాయి. ఆమె తండ్రి పాకిస్తాన్ మాజీ మిలిటరీ మేజర్. అతను పాక్ ఆర్మీ నుంచి తప్పుకున్న తర్వాత అమెరికా వెళ్లి సెటిల్ అయ్యాడు. ఆ తర్వాత ఇమాన్వి సోషల్ మీడియాలో డాన్సులు చేస్తూ తెచ్చుకున్న క్రేజ్ కారణంగా ఆమెకు ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం దక్కింది. ఇప్పుడు ఈ కాల్పుల ఘటనలో ఇమాన్వి ప్రమేయం లేకపోయినా, ఆమె ఒక పాకిస్తాన్ మూలాలు ఉన్న వ్యక్తి కావడంతో ఆమెను సినిమా నుంచి తప్పించాలంటూ సోషల్ మీడియాలో కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. ఇందులో ఏమాత్రం లాజిక్ లేకపోయినా, పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తేలిన నేపథ్యంలో ఈ డిమాండ్ వినిపిస్తోంది. మరి సినిమా టీం ఈ విషయాన్ని ఏమైనా కన్సిడర్ చేస్తుందో లేదో చూడాల్సి ఉంది.