ఈ మధ్య కాలంలో ప్రతి ఒక మూవీలో విలన్‌లు బాగా హైలెట్ అవుతున్నారు. హీరోలకు దీటుగా నటిస్తూ వారు కూడా సెపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంటున్నారు.అలా ప్రస్తుతం బాలీవుడ్,కోలీవుడ్, టాలీవుడ్ లో బాగా వినిపిస్తున్న పేరు బాబి డియల్.‘యానిమల్’ సినిమాతో మంచి కం బ్యాక్ ఇచ్చి. ఒక డైలాగ్ కూడా లేకుండా తన నటనతో ప్రేక్షకులను పెద్ద ఎత్తున మెప్పించాడు బాబి. ఇక ఈ సినిమాలో రణబీర్ కపూర్ నటన తర్వాత బాబీ డియోల్ నటనకు పెద్ద ఎత్తున ప్రశంసలు లభించాయి.
Also Read:Jr. NTR : జపాన్‌లో ‘దేవర’ ప్రమోషన్ మొదలెట్టిన తారక్..
ఈ మూవీ తర్వాత అతని నటనకు పెద్ద ఎత్తున అభిమానులు పెరిగిపోయారు. దీంతో వరుసగా సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా బాబి ‘ఆశ్రమం’ సిరీస్లో నటిస్తున్నాడు. 2020లో ఈ సిరీస్ సీజన్ 1, సీజన్ 2 రాగా, 2022లో సీజన్ 3 విడుదలైంది. దీని పార్ట్ 2 ఫిబ్రవరి 27 నుంచి ఎమ్ఎక్స్ ప్లేయర్ లో స్ట్రీమింగ్ కానుంది.దీంతో తాజాగా ఈ సిరీస్ లో తన పాత్ర గురించి బాబీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.
‘నేనెప్పుడూ ఛాలెంజింగ్ పాత్రలు బాగా ఇష్టపడత. ఎందుకంటే అలాటివి తీస్తేనే మంచి గుర్తింపు వస్తుంది. ఈ సిరీస్ కోసం దర్శకుడు నన్ను సంప్రదించినప్పుడు పోలీసు అధికారి పాత్ర ఇస్తారని అనుకున్న. కానీ బాబా పాత్ర కోసం అని తెలిసి ఆశ్చర్యపోయా. ఆయన ముందు నా పాత్ర గురించి చెబితే నమ్మలేదు. బాబా పాత్ర నేను పోషించగలనని ఆయన పూర్తిగా నమ్మారు. ఇలాంటి పాత్ర లభించాలంటే అదృష్టం ఉండాలి. ఇది నా జీవితంలో అద్భుతమైన ప్రయాణం. చెప్పాలంటే ప్రతి ఒక నటుడు ఒక్కసారైనా ఇలాంటి పాత్రలో చేయాలని కోరుకుంటారు’ అని తెలిపారు బాబి.