మెగాస్టార్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూసిన OG చిత్రం విడుదలైనప్పుడు ఫ్యాన్స్‌లో పండగ వాతావరణం నెలకొంది. సినిమా సూపర్‌హిట్ అని అందరూ భావించారు. తొలిరోజు ఏకంగా 154 కోట్ల రూపాయల భారీ వసూళ్లతో రికార్డులు సృష్టించింది. అయితే, ఇంతటి పాజిటివ్ టాక్, భారీ ఓపెనింగ్స్ సాధించినప్పటికీ, ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావడానికి 12 రోజులు ఎందుకు పట్టింది? ఆ ఒక్క తప్పు జరగకపోతే OG ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసి ఉండేదా? ఇంతకీ ఈ సినిమాకు మైనస్ అయింది ఏమిటి?
Also Read: Rashmika – Rukmini : రష్మికకు చెక్ పెడుతున్న సెన్సేషనల్ హీరోయిన్..
సామాన్యుడికి భారంగా
ప్రస్తుతం పెద్ద సినిమాల టిక్కెట్ రేట్లు సామాన్యుడికి భారంగా మారుతున్నాయి. ముఖ్యంగా ప్రీమియర్ షోల పేరుతో అమాంతం ధరలు పెంచేస్తున్నారు. OG విషయంలోనూ ఇదే జరిగింది. తెలంగాణలో ప్రీమియర్ టిక్కెట్ ధర రూ.800, ఆంధ్రప్రదేశ్‌లో ఏకంగా రూ.1000 వరకు పలికింది. సాధారణ రోజుల్లోనూ మల్టీప్లెక్స్‌లలో టిక్కెట్ ధరలు అధికంగా ఉండటంతో, ఒక మధ్యతరగతి కుటుంబం సినిమాకు వెళ్లాలంటే సుమారు 2000 నుంచి 3000 రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఈ అధిక ధరలే కుటుంబ ప్రేక్షకులను థియేటర్లకు దూరం చేస్తున్నాయి. అభిమానులు, సినీ ప్రియులు మొదటి వారాంతం సినిమాలను చూసినా, ఆ తర్వాత సినిమా నిలబడాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ రాక తప్పనిసరి. OG విషయంలో ఈ వర్గం ప్రేక్షకులు దూరంగా ఉండటమే బ్రేక్ ఈవెన్‌కు ఎక్కువ సమయం పట్టడానికి ప్రధాన కారణమైంది.
Also Read: Varun Sandesh : ఆ “హ్యాపీడేస్” గుర్తు వస్తున్నాయి
చిన్న చిత్రాల తెలివైన వ్యూహం
ఒకవైపు పెద్ద సినిమాలు టిక్కెట్ రేట్లతో ప్రేక్షకులను దూరం చేస్తుంటే, మరోవైపు చిన్న చిత్రాలు తెలివైన వ్యూహాలతో ఘన విజయాలు సాధిస్తున్నాయి. సినిమా బాగుంటే, టిక్కెట్ ధర అందుబాటులో ఉంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని నిరూపిస్తున్నాయి.
తెలంగాణ మల్టీప్లెక్స్‌లలో సాధారణ టిక్కెట్ ధర రూ.295 ఉండగా, ‘లిటిల్ హార్ట్స్’ చిత్రాన్ని కేవలం రూ.200కే ప్రదర్శించారు. ఈ వ్యూహం ఫలించి, కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. ఇదే బాటలో ‘మహావతార్ నరసింహ’ కూడా విజయం సాధించింది. మిరాయ్: కేవలం 37 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, ఏకంగా 80 కోట్ల షేర్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఈ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచకుండా, నిర్మాతలను హీరో తేజ సజ్జ స్వయంగా అడ్డుకున్నారని వార్తలు వచ్చాయి. అందుబాటు ధరల వల్లే ఈ చిత్రం ఇంతటి భారీ లాభాలను అందుకుంది. పాజిటివ్ టాక్, దానికి తోడు అందుబాటులో ఉండే టిక్కెట్ ధరలు.. ఇదే నేటి సినిమా విజయానికి అసలైన సూత్రం. ‘కొత్తలోక’, ‘కిష్కింధపురి’ వంటి చిత్రాలు కూడా ఇదే ఫార్ములాతో హిట్ కొట్టాయి. పెద్ద చిత్రాల నిర్మాతలు ఈ చిన్న చిత్రాల విజయ రహస్యాన్ని ఇప్పటికైనా గుర్తిస్తారేమో చూడాలి.