ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహించగా, టాలీవుడ్ బడా నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని మరియు వై. రవిశంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ బోర్స్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి.
Also Read : Exclusive : సెప్టెంబర్ రేస్ లో బాలయ్య, పవన్ లో ఒకరు మాత్రమే
తాజాగా నెల రోజుల షూటింగ్ షెడ్యూల్ ఈరోజు హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ లో హీరో రామ్ మరియు భాగ్యశ్రీ బోర్సే పై ప్రేమ సన్నివేశాలను రాత్రి నేపథ్యంలో చిత్రీకరిస్తున్నారు. ఈ నైట్ షెడ్యూల్ దాదాపుగా 10 రోజుల పాటు కొనసాగుతుంది, ఆ తర్వాత క్లైమాక్స్ మరియు ఇతర కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి బృందం తదుపరి 20 రోజుల లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తోంది. ఈ చివరి షెడ్యూల్‌తో, సినిమా షూటింగ్ పూర్తి అవుతుంది. ఈ సినిమాలో కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కు భారీ స్పందన వచ్చింది మరియు సినిమాపై అంచనాలు పెంచింది. సిద్ధార్థ నుని సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్న ఈ సినిమాకు కోలీవుడ్ సంగీత ద్వయం వివేక్-మెర్విన్ మ్యూజిక్ అందిస్తున్నారు. చక చక షూటింగ్ ఫినిష్ చేసి ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయాలనీ చూస్తున్నారు ఆంధ్రా కింగ్ తాలూకా నిర్మాతలు. ఈ ఏడాది దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లానింగ్ చేస్తున్నారు మేకర్స్.