టాలీవుడ్ లో సాలిడ్ క్రేజ్ కలిగిన యువ హీరోలలో నితిన్ ఒకరు. కెరీర్ స్టార్టింగ్ లో వరుస సినిమాల్లో నటించి మంచి విజయాలు అందుకున్న నితిన్ ఈ మధ్య కాలంలో వరుసగా అపజయాలను ఎదుర్కొంటూ వస్తున్నాడు. కొంత కాలం క్రితం ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఈయనకు బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ ఎదురయింది.దీంతర్వాత ఆఖరిగా ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కూడా ప్రేక్షకులను నిరాశ పరిచింది. ఇకపోతే ప్రస్తుతం ‘రాబిన్ హుడ్’,‘తమ్ముడు’ అనే రెండు సినిమాలలో నటిస్తున్నాడు. ఇందులో వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాబిన్‌హుడ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. కాగా ఈ సినిమా నుంచి టీజర్, ఫస్ట్ సింగిల్ సాంగ్ రిలీజ్ కాగా.. తాజాగా సెకండ్ సాంగ్ గురించి ఒక అప్ డేట్ ఇచ్చారు మూవీ టీం..
‘వేరెవర్ యు గో’ అంటూ సాగే ఈ సెకండ్ సింగిల్ సాంగ్ పలు బ్రాండ్స్, వాటి ట్యాగ్స్‌తో సాగనున్నట్లు దర్శకుడు వెంకీ కుడుముల, హీరో నితిన్, మ్యూజిక్ డైరెక్టర్ జి.వి.ప్రకాష్ కుమార్ ఓ అనౌన్స్‌మెంట్ వీడియోలో తెలిపారు. ఈ అనౌన్స్‌మెంట్ వీడియోను చాలా క్రియేటివిగా డిజైన్ చేశారు మేకర్స్. చూస్తుంటే ఈ సెకండ్ సాంగ్ వెరైటీగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ పాటకు సంబంధించిన ప్రోమో ఫిబ్రవరి 13న అంటే ఈ రోజు రిలీజ్ చేయనుండగా..మొత్తం పాటను ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాని మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.
#Robinhood 2nd single from FEB14th onwards ❤️ pic.twitter.com/0nqq2iDCJf
— nithiin (@actor_nithiin) February 12, 2025