ఇస్మార్ట్ శంకర్ దిమాక్ కరాబ్ సాంగ్ తో ఓవర్ నైట్ క్రష్ బ్యూటీగా మారింది నిధి అగర్వాల్. అంతకు ముందు సవ్యసాచి, మిస్టర్ మజ్ను లాంటి చిత్రాల్లో నటించినా రాని గుర్తింపు.. ఈ స్పెషల్ సాంగ్ తో.. యూత్ దిమాక్ కరాబ్ చేసేసింది. కానీ ఈ గ్లామర్ షో అవకాశాలను తెచ్చిపెట్టలేకపోయాయి. హీరో అనే మూవీ చేస్తే.. తనకు కలిసి వచ్చిందేమీ లేదు. ఆ టైంలోనే స్టార్ హీరోలతో నటించే ఛాన్సులొచ్చాయి. పవన్ కళ్యాణ్ సరసన హరి హర వీరమల్లు.. ప్రభాస్ రాజా సాబ్ లో హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది బ్యూటీ.
Also Read:Vijay Devarakonda : అనిరుధ్ కు విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్..
పవన్ కళ్యాణ్, ప్రభాస్ చిత్రాలతో తన లక్కు మారిపోయిందని, ఇద్దరు స్టార్లతో నటించే ఛాన్స్ కొల్లగొట్టానని మురిసిపోయింది నిధి. కానీ తాను ఒకటి అనుకుంటే.. హీరోలు మరోటి డిసైడ్ చేశారు. ఒక్కో సినిమా కంప్లీట్ చేయడానికి ఏళ్లు తీసుకుంటున్నారు. పొలిటికల్ జర్నీ వల్ల పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు చేయడానికి ఐదేళ్లు తీసుకున్నాడు. దీంతో నిధి కూడా ఆ సినిమాతో 5 ఏళ్లుగా కొనసాగుతోంది. ఇక ప్రభాస్ రాజా సాబ్ పట్టాలెక్కడమే కానీ.. ఎప్పుడు కంప్లీట్ అవుతుందో అప్డేట్ లేదు.
Also Read:Tamannaah : తమన్నాను తీసుకోవడం కరెక్ట్ కాదు.. నటి రమ్య షాకింగ్ కామెంట్స్..
ఈ రెండు చిత్రాల వల్ల కొత్త సినిమాలకు కమిట్ కాలేకపోయింది ఇస్మార్ట్ బ్యూటీ. పూర్తిగా ఈ ప్రాజెక్టులకే అంకితం అయిపోయింది. టాలీవుడ్ లో మరో కొత్త ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేసిన దాఖలాలు లేవు. హీరో తర్వాత ఆమె సిల్వర్ స్క్రీన్ పై కనిపించి దాదాపు మూడేళ్లు దాటుతోంది. ఇప్పుడు హరి హర వీరమల్లు జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరీ ఇన్నాళ్లుగా పడిన కష్టానికి సరైన ప్రతిఫలం దక్కుతుందా.. సినిమా రిజల్టుతో సంబంధం లేకుండా ఛాన్సులు కొల్లగొతుడుందా..?