Tamannaah : తమన్నాపై నటి రమ్య షాకింగ్ కామెంట్స్ చేసింది. తమను కాదని తమన్నాను తీసుకుంటారా అంటూ ఫైర్ అయింది. ప్రస్తుతం కర్ణాటకలో కన్నడ భాష ఉద్యమాలు నడుస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో కర్ణాటక ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న మైసూర్ సోప్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడంపై ఇప్పటికే వివాదం చెలరేగుతోంది. తాజాగా నటి రమ్య ఈ విషయంపై తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ మేరకు సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్టు పెట్టింది. తమన్నాను తీసుకోవడం కరెక్ట్ కాదంటూ మండిపడింది రమ్య.
Read Also : Allu Arjun: ఆగిపోయిన సినిమా టైటిల్ పై కన్నేసిన బన్నీ
‘ప్రస్తుతం మన కన్నడ భాష కోసం మనం పోరాడుతున్నాం. కానీ అది కొన్ని సార్లు తప్పుదోవ పడుతున్నట్టు కనిపిస్తోంది. మన లోకల్ ప్రియారిటీని మర్చిపోతున్నట్టు అనిపిస్తోంది. మైసూర్ సోప్ అంటే అది కేవలం సోప్ మాత్రమే కాదు.. కన్నడ ప్రజల సెంటిమెంట్. దానికి ప్రత్యేకించి బ్రాండ్ అంబాసిడర్లు అవసరం లేదు. ఒకవేళ పెట్టాలి అనుకుంటే లోకల్ గా ఉన్న మమ్మల్ని పెట్టాలి. అంతే గానీ నార్త్ కస్టమర్ల కోసం తమన్నాను పెట్టుకోవడం సరిగ్గా అనిపించట్లేదు.
నేను తమన్నాకు వ్యతిరేకం కాదు. కానీ మన ప్రాంతీయ భాషను కాపాడుకుంటున్నాం. ఇలాంటి టైమ్ లో కన్నడ ప్రజల సెంటిమెంట్ ను బయటి వారి చేతుల్లో పెట్టడం కరెక్ట్ కాదు. ఇలా చేయడం వల్ల స్థానికంగా ఉన్న కన్నడ వారిని మీరు దూరం చేసుకుంటున్నారు. ఇది మాకు తీవ్ర నిరాశ కలిగిస్తోంది. దీనిపై పునరాలోచించాలి’ అంటూ తెలిపింది రమ్య.
Read Also : Mirai : ‘మిరాయ్’ మరో కార్తికేయ-2 అవుతుందా..?