Vijay Devarakonda : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఇండస్ట్రీలో అందరితో మంచి రిలేషన్ మెయింటేన్ చేస్తుంటాడు. చాలా మందికి తన రౌడీ బ్రాండ్ బట్టలు లేదంటే ఇతర ఖరీదైన వస్తువులను గిఫ్ట్ లుగా ఇస్తుంటాడు. తాజాగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కు కూడా మంచి గిఫ్ట్ ఇచ్చాడు. విజయ్ నటిస్తున్న తాజా మూవీ కింగ్ డమ్. గౌతమ్ తిన్నమూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్నా.. అనేక కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. చివరకు జులై 4న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. విజయ్ మూవీకి ఫస్ట్ టైమ్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
Read Also : Macron: ఎప్పుడూ సరదాగా చేసినట్టే చేసింది.. పోట్లాటపై ఫ్రెంచ్ అధ్యక్షుడు క్లారిటీ
తాజాగా వీరిద్దరూ కలిసి చర్చించుకున్నారు. ఈ సందర్భంగా అనిరుధ్ కు రౌడీ బ్రాండ్ టీ షర్ట్, షటిల్ బ్యాట్ గిఫ్ట్ గా ఇచ్చాడు విజయ్ దేవరకొండ. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియోను సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ స్పెషల్ గా పోస్టు చేసింది. ఆ వీడియోలో ద బాయ్స్ మీట్ అంటూ రాసుకొచ్చారు. ఇద్దరు ఎనర్జిటిక్ కుర్రాళ్లు కలిసిన వేళ అంటూ రాసుకొచ్చారు. ఇక కింగ్ డమ్ విషయానికి వస్తే.. కథ చాలా డిఫరెంట్ గా అనిపిస్తోంది. విజయ్ ఇందులో గుండుతో కనిపించడం.. పైగా అతని లుక్ మరింత మెస్మరైజింగ్ గా అనిపిస్తోంది. విజయ్ కు మంచి హిట్ పడి చాలా రోజులు అవుతోంది. తాజాగా అతను ఈ సినిమాతో భారీ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Read Also : Ganja Smuggling: పుష్ప సినిమా తరహాలో గంజాయి స్మగ్లింగ్.. ఎలా చిక్కారంటే..!