New Twist in Raj Tarun – Lavanya Issue: లావణ్య రాజ్ తరుణ్ కేసులో కొత్త ట్విస్ట్ తెర మీదకు వచ్చింది. ఇప్పటికే ఈ కేసులో అనేక మలుపులు తిరుగుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజ్ తరుణ్ తనను ప్రేమించి రహస్యంగా వివాహం చేసుకొని ఇప్పుడు మాల్వి మల్హోత్రా కోసం తనను వదిలేశాడని లావణ్య ఆరోపిస్తోంది. ఈ క్రమంలో రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా వేర్వేరుగా కేసులు నమోదు చేశారు. లావణ్య తమను వేధిస్తోందని వారు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
BiggBoss OTT 3 Winner: బిగ్ బాస్ విజేతగా హీరోయిన్.. ఏకంగా అన్ని లక్షల ప్రైజ్ మని..
అయితే ఈ సమయంలో మధ్యలో శేఖర్ భాష అనే ఒక వ్యక్తి రాజ్ తరుణ్ ఫ్రెండ్ అని చెప్పుకుంటూ లావణ్య మీద అనేక ఆరోపణలు చేస్తున్నాడు. ఇదంతా ఒకపక్క జరుగుతుండగానే తనకు డ్రగ్స్ అలవాటు చేసేందని లావణ్య పై ప్రీతి, ఉదయ్ అనే ఇద్దరు ఫిర్యాదు చేశారు. లావణ్య తమకు ఫోన్ చేసి ఇబ్బందులకు గురిచేస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. గత మూడేళ్లుగా లావణ్యతో పరిచయం ఉందని ప్రీతి, ఉదయ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక మరోపక్క అరియాన కూడా రాజ్ తరుణ్ బాధితురాలు అని ఆమెను కూడా ప్రేమ పేరుతో కడుపు చేసి అబార్షన్ కూడా చేయించాడని లావణ్య ఆరోపించారు.