మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఇప్పటికే నయనతార హీరోయిన్‌గా ఎంపికైంది. అయితే, నయనతార హీరోయిన్‌గా ఎంపికైన విషయంపై అనేక చర్చలు జరిగాయి. ఆమె ఏకంగా 18 కోట్లు హీరోయిన్‌గా నటించడానికి డిమాండ్ చేసినట్లు వార్తలు కూడా వచ్చాయి. చివరికి సినిమా టీం 12 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైందని కూడా అన్నారు. అయితే, ఇదంతా కేవలం ప్రచారమేనని తెలుస్తోంది.
Chiru Anil: చిరు- అనిల్ సినిమా షూటింగ్ ఆరోజు నుండే!
నయనతారకు కేవలం 6 కోట్ల రూపాయలు మాత్రమే రెమ్యూనరేషన్‌గా ఇవ్వబోతున్నారని సమాచారం. నిన్న ఆమె కోసం అనిల్ రావిపూడి చెన్నై బయలుదేరి వెళ్లారు. అక్కడ ఒక అనౌన్స్‌మెంట్ వీడియో షూట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 22వ తేదీన షూటింగ్ ప్రారంభించబోతున్నారు. ఒక సాంగ్‌తో పాటు కీలకమైన సీక్వెన్స్‌లు కూడా షూట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక షూటింగ్ ప్రారంభానికి సంబంధించి ఆమె చేత ఈ వీడియో రిలీజ్ చేయిస్తారని అంటున్నారు.