సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన “నారప్ప” చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. తమిళ బ్లాక్ బస్టర్ మూవీ “అసురన్” తెలుగు రీమేక్ ఈ చిత్రం. ఈ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో అవార్డు గెలుచుకున్న నటి ప్రియామణి వెంకీ భార్యగా నటించింది. దీనిని వి క్రియేషన్స్ మరియు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లలో కలైపులి ఎస్ థాను, డి సురేష్ బాబు నిర్మించారు. ఈ చిత్రానికి మణి శర్మ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం ఈ ఏడాది మే 14న విడుదలవుతుందని మేకర్స్ ప్రకటించారు. కానీ అన్ని చిత్రాల్లాగే ఈ చిత్రం కూడా కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. అయితే ఇప్పుడు క్రమంగా కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తగ్గుతుండడంతో త్వరలోనే 50 శాతం ఆక్యుపెన్సీతో తెలంగాణలోని థియేటర్లు తిరిగి ఓపెన్ కావొచ్చని అంటున్నారు.
Also Read : తస్మాత్ జాగ్రత్త… చోరుడు వచ్చే సమయం ఆసన్నమైంది…!
కానీ స్టార్ ప్రొడ్యూసర్స్ అంతా 100 శాతం ఆక్యుపెన్సీ కోసం ఎదురు చూస్తున్నారు. జూలై రెండవ వారంలో ప్రభుత్వం 100 శాతం ఆక్యుపెన్సీని అనుమతించవచ్చు. అయితే 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరిచినప్పుడు విడుదలయ్యే మొదటి పెద్ద చిత్రం “నారప్ప” అంటున్నారు. ఇప్పుడు “నారప్ప” ప్యాచ్ వర్క్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి. ఈ చిత్ర నిర్మాతలు మొదటి కాపీని మరో వారంలో సిద్ధం చేయనున్నారని సమాచారం.