నేచురల్ స్టార్ నాని ఇటీవల వరుస హిట్లతో ఫుల్ జోష్ మీద ఉన్నాడు. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన దసరా సినిమా ఎంతటి విజయాన్ని నమోదు చేసిందో తెలిసిన విషయమే. ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూలు చేసి నాని కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దసరా డబ్బులతో పాటు సైమా, ఐఫా అవార్డులను తెచ్చిపెటింది. ఆ సినిమా ఇచ్చిన నమ్మకంతో అదే దర్శకుడితో రెండో సారి వీరి కాంబోలో మరో సినిమా వస్తున్నట్టు ప్రకటించారు. నాని కెరీర్‌లో 33వ సినిమాగా రానున్న ఈ సినిమాను నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
Also Read : AAArts : ఢిల్లీ ఫైల్స్ పార్ట్ -1 ( బెంగాల్ చాప్టర్) రిలీజ్ డేట్ ఫిక్స్..?
కాగా నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో రాబోతున్న రెండో సినిమాను ఈనెల 12న దసరా సందర్భంగా లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా మూవీ సికింద్రాబాద్ బ్యాక్ డ్రాప్లో సాగే కథతో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి భారీ సెట్స్ వేశారు మేకర్స్. మాస్ యాక్షన్ లో రానున్నఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నాడు. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారక ప్రకటన రానుంది. నాని, అనిరుధ్ కాంబోలో గ్యాంగ్ లీడర్, జెర్సీ సినిమాలకు హిట్ ఆల్బమ్స్ అందించాడు. ప్రస్తుతం నాని శైలేష్ కొలను దర్శకత్వంలో ‘హిట్’ ఫ్రాంచైజీలో భాగంగా తెరకెక్కనున్న ‘హిట్: ది థర్డ్ కేస్’ లో నటిస్తున్నాడు. కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుందని, తాజాగా శ్రీనిధి షూటింగ్ లో పాల్గొన్న ఫోటోను షేర్ చేశారు. HIT 3ని మే 1, 2025న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.