భారత్ లో పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడులకు పాల్పడిన పాకిస్తాన్ సైన్యం పట్ల కఠినంగా వ్యవహరించాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భారత సైన్యాన్ని ఆదేశించారు. నియంత్రణ రేఖ వద్ద భారత పౌరులను లక్ష్యంగా చేసుకుంటున్న పాకిస్తాన్ సైన్యంపై కఠినమైన, శిక్షార్హమైన చర్యలు తీసుకోవాలని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారని వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ తాట తీయాల్సిందేనని సైన్యాన్ని ఆదేశించినట్లు సమాచారం.
Also Read:India Pak War : భారత్‌లో 32 విమానాశ్రయాలు మూసివేత..
భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య, రక్షణ మంత్రి శనివారం ఢిల్లీలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS), త్రివిధ దళాల అధిపతులతో సమావేశం నిర్వహించి పరిస్థితిని అంచనా వేయనున్నారు. అంతకుముందు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ తీవ్రమైన అంశంపై సమావేశం నిర్వహించారు. దీనికి రక్షణ మంత్రి, జాతీయ భద్రతా సలహాదారు, రక్షణ సిబ్బంది చీఫ్, సాయుధ దళాల అధిపతులు సహా ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు.
Also Read:Operation Sindoor: ఉదయం 10 గంటలకు భారత సైన్యం అత్యవసర మీడియా సమావేశం..
గత కొన్ని రోజులుగా, పూంచ్, రాజౌరిలలో పాకిస్తాన్ దాడులను ముమ్మరం చేసింది. పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు భారత సైన్యం చాలా చోట్ల గట్టి సమాధానం ఇచ్చింది. శుక్రవారం, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్‌లోని 20 కి పైగా నగరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ డ్రోన్‌లను భారత సైన్యం అడ్డుకుంది. భారత సాయుధ దళాలు పూర్తి అప్రమత్తతతో పనిచేస్తున్నాయి. పౌరుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. సరిహద్దులో శాంతి నెలకొల్పడానికి పాకిస్తాన్ సైన్యానికి ధీటైన సమాధానం ఇవ్వాలని రాజ్‌నాథ్ సింగ్ ఆదేశించారు.