ఈరోజు నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది అని నందమూరి బాలకృష్ణ అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందించారు. మీరు చూపిన ప్రేమ, అభిమానం, ఆశీస్సులు నా జీవితానికి మరింత అర్థం ఇచ్చాయి. ప్రత్యేకంగా — నా జన్మదినాన్ని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం గ్రామ గ్రామాన, మండల కేంద్రాల్లో ఎంతో ఉత్సాహంగా అన్నదానాలు, రక్తదాన శిబిరాలు వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకి, అభిమానికి హృదయపూర్వక ధన్యవాదాలు అన్నారు ఆయన.
Also Read: Ustad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్‌లో జాయినయిన పవర్ స్టార్
ఇక ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయం బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇన్స్టిట్యూట్‌లో నా అభిమానులు స్వయంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం. రక్తదానం అనేది జీవితాన్నే ఇచ్చే గొప్ప దానం. మీ ప్రేమ కేవలం మాటల్లో కాదు… ఆచరణలో, సేవలో, మానవత్వంలో చూపించటమే నాకు గొప్ప గర్వకారణం. నిజమైన అభిమానం అంటే ఇదే! ఒకటి కాదు… రెండు కాదు… ఎన్నో జీవితాలకు వెలుగు ఇచ్చే పని చేయడం — ఇది మీ హృదయాల విశాలతకు నిదర్శనం.
Also Read: Nagarjuna: సౌత్ స్టార్ అన్నవారిపై నాగ్ చురకలు
ఈరోజు నన్ను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఆదరణా హృదయానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేమ, మద్దతు నాకు జీవితాంతం స్ఫూర్తిగా నిలుస్తాయి. మీతో కలిసి మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలనే ఉత్సాహం నాలో నింపారు. ఈ రోజు నా జీవితంలోని మరపురాని రోజుగా మార్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అని బాలకృష్ణ అన్నారు.