ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న ‘కుబేర’ ఇండియన్ సినిమాలో గేమ్-ఛేంజర్‌గా నిలవబోతోంది. ఇప్పటికే విడుదలైన కుబేర ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. పోయిరా మామ, ‘ట్రాన్స్ ఆఫ్ కుబేర’ చార్ట్ బస్టర్ రెస్పాన్స్ తో మ్యూజిక్ చార్ట్స్ లో టాప్ ట్రెండింగ్ లో వున్నాయి. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ హై ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు. కుబేర తెలుగు, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ‘పీ పీ డుమ్ డుమ్’ పాటని ముంబయిలో గ్రాండ్ గా లాంచ్ చేశారు.
Also Read : Dhanush: ముంబైలో తమిళ్ లో మాట్లాడి షాకిచ్చిన ధనుష్
ఈ క్రమంలో హీరో కింగ్ నాగార్జున మాట్లాడుతూ తనని సౌత్ స్టార్ అని సంభోదించిన వారికి చురకలు అంటించారు. ఆ తరువాత మాట్లాడుతూ మీరందరూ చూపించే ప్రేమకి కృతజ్ఞతలు. శివ, క్రిమినల్..ఇలా నా కెరీర్ బిగినింగ్ నుంచి నా చిత్రాలకి ఇక్కడ ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. నా డబ్బింగ్ చిత్రాలు కూడా ఇక్కడ చాలా అద్భుతంగా యాక్సెప్ట్ చేశారు. కుబేర నాకు చాలా స్పెషల్ ఫిలిం. ఏదైనా డిఫరెంట్ గా చేయాలి అనుకున్నప్పుడు శేఖర్ వచ్చారు. ఆయనతో గత 15 ఏళ్లుగా పని చేయాలని అనుకుంటున్నాను. ఆయన ఈ సినిమా గురించి చెప్పినప్పుడు మరో ఆలోచన లేకుండా ఓకే చేశాను. శేఖర్ బ్రిలియంట్ ఫిలిం మేకర్. తన సెన్సిబిలిటీస్ అద్భుతంగా ఉంటాయి. తన మనసు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అది స్క్రీన్ మీద కనిపిస్తుంది.
Also Read : Trivikram: పాపం.. కన్ఫ్యూజన్లో త్రివిక్రమ్!
జిమ్ సర్బ్ తో కలిసి పనిచేయడం మంచి ఎక్స్పీరియన్స్. తెలుగు చాలా చక్కగా మాట్లాడారు. రష్మిక పవర్ హౌస్ ఆఫ్ టాలెంట్. తన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి. తను ఈ సినిమాలో అద్భుతంగా నటించింది. డబ్బింగ్ చూసిన తర్వాత తనకు ఫోన్ చేసి అభినందించాను. ఇందులో తన పెర్ఫార్మన్స్ మిమ్మల్ని అలరిస్తుంది. దేవిశ్రీ నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమా కోసం అవుట్ స్టాండింగ్ మ్యూజిక్ ఇచ్చారు. తన సంగీతంతో సినిమాని మరో స్థాయికి తీసుకువెళ్లారు. ధనుష్ బ్రిలియంట్ యాక్టర్. ఈ సినిమాలో అద్భుతంగా చేశారు. తన ప్రతి సినిమాకి వైవిధ్యం చూపిస్తుంటారు. తనతో కలిసి వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. జూన్ 20న మీరందరూ సినిమా చూసి ఎంజాయ్ చేయాలి’ అన్నారు.