పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్, మైత్రి మూవీ మేకర్స్ సెన్సేషనల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో అఫీషియల్ గా షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఎంట్రీతో సెట్స్ లో జోష్ నెలకొంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. పవన్ కళ్యాణ్ తో పాటు, సినిమాలోని ఇతర కీలక పాత్రలలో నటిస్తున్న వారు కూడా షూటింగ్‌లో పాల్గొంటున్నారు.
Also Read: Dhanush: ముంబైలో తమిళ్ లో మాట్లాడి షాకిచ్చిన ధనుష్
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై.రవి శంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీ లీల కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాకి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఆయనంక బోస్ సినిమాటోగ్రఫీని అందిస్తున్న ఈ సినిమాకి ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్. రామ్-లక్ష్మణ్ ద్వయం యాక్షన్ సీక్వెన్స్‌లను కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఆనంద్ సాయి ప్రొడక్షన్ డిజైనర్. స్క్రీన్ ప్లే కె. దశరథ్ రాశారు, అడిషినల్ రైటింగ్ సి చంద్ర మోహన్.