Nagarjuna: ‘చెప్పిన డేట్‌కు రాకపోతే ఎలా?’.. ఆదర్శకుటుంబానికి నాగార్జున సూటి ప్రశ్న!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagarjuna: టాలీవుడ్లో ఇటీవల రిలీజ్ డేట్లను ప్రకటించి, ఆ తర్వాత సైలెంట్‌గా వాయిదా వేసుకోవడంపై కింగ్ అక్కినేని నాగార్జున చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డైరెక్టర్ వెంకీ కుడుముల ప్రొడ్యూస్ చేసిన ‘ఇట్లు అర్జున’ సినిమాను నాగార్జున స్వయంగా సమర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన నాగ్‌కు రిలీజ్ క్లాష్‌పై నేరుగానే ప్రశ్న ఎదురైంది. అక్టోబర్ 30న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా రిలీజ్ అవుతున్నప్పటికీ మీ ‘ఇట్లు అర్జున’ థియేటర్లలోకి వస్తుందా? అని మీడియా అడగ్గా, మైక్ అందుకున్న నాగార్జున గట్టిగానే స్పందించారు. రిలీజ్ డేట్ల మార్పులపై నాగార్జున స్పందిస్తూ.. “మొదట అక్టోబర్ 2న రావాలనుకున్నారు, ఆ తర్వాత అక్టోబర్ 9 అనుకున్నారు. తీరా చూస్తే పెద్ద సినిమాలు వస్తున్నాయంటూ వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మళ్లీ అక్టోబర్ 30 అనుకుంటున్నారు. కనీసం ఈసారైనా అక్టోబర్ 30న వాయిదా పడకుండా రావాలని నేను కోరుకుంటున్నాను” అంటూ చురకలు అంటించారు. కావాలని ఎవరూ డేట్లు బ్లాక్ చేయరని, ఒక్కోసారి పరిస్థితుల వల్ల డేట్లు మిస్ అవుతాయని సర్దిచెప్పినప్పటికీ, చెప్పిన డేట్‌కు రాకపోవడం వల్ల చిన్న సినిమాలకు ఎదురయ్యే ఇబ్బందులను ఆయన మాటలు స్పష్టం చేశాయి.
సినిమా రిలీజ్ డేట్‌కు ఇచ్చే విలువ గురించి మాట్లాడుతూ తన ప్రాజెక్ట్‌ను ఉదాహరణగా ప్రస్తావించారు నాగ్. “నేను డిసెంబర్ 24న వస్తున్నానని చెప్పాను. అందుకే ఆ మాట నిలబెట్టుకోవడానికి రాత్రింబవళ్లు నిద్రలేకుండా కష్టపడి సినిమాను పూర్తి చేస్తున్నా” అంటూ కమిట్మెంట్ అంటే ఎలా ఉండాలో గుర్తుచేశారు. “మీలాంటి బడా స్టార్ సమర్పిస్తున్న సినిమాకే ఇలాంటి వాయిదాల పరిస్థితి వస్తోంది కదా, దీనిపై మీరేమైనా చర్యలు తీసుకుంటారా?” అని మీడియా ప్రశ్నించగా నాగార్జున “నో కామెంట్స్” అంటూ దాటవేశారు. అలాగే “పాన్ ఇండియా సినిమాల విషయంలో స్టార్ హీరోలు ఇతర భాషల్లో ప్రమోషన్లు అన్నీ చేసి, తెలుగుకి వచ్చేసరికి లోకల్ మీడియా ఇంటరాక్షన్లను అవాయిడ్ చేస్తున్నారు.. దీనిపై మీరేమంటారు?” అని అడిగిన ప్రశ్నకు కూడా ఎలాంటి వివాదానికి తావివ్వకుండా “నో కామెంట్స్” అని సమాధానమిచ్చారు. చెప్పిన తేదీకి రాకుండా డేట్లను మార్చడంపై నాగార్జున చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
Also Read
తాజావార్తలు
-
Nagarjuna: ‘చెప్పిన డేట్‌కు రాకపోతే ఎలా?’.. ఆదర్శకుటుంబానికి నాగార్జున సూటి ప్రశ్న!
-
Gold ETF: గోల్డ్ ETF FoFలో కొత్త పెట్టుబడులకు బ్రేక్.. ఇప్పటికే ఉన్న SIPలు కొనసాగుతాయా?
-
Meerut Murder Case: భర్తను చంపి పాముకాటు డ్రామా.. భార్య, ఆమె లవర్‌కు ‘‘ఉరిశిక్ష’’..
-
Penukonda Tragedy: దసరా సెలవుల్లో విషాదం.. గొల్లపల్లి రిజర్వాయర్‌లో ఐదుగురు మృతి
-
KitKat Chocolate Worms : కిట్ క్యాట్‌లో పురుగులు.. కూకట్పల్లి లులు మాల్లో షాకింగ్ ఘటన
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!