అకాల వర్షాలు కారణంగా అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలో భారీ వరదలు వచ్చాయి. వరదల కారణంగా ఎందరో ప్రజలు నిరాశ్రయులయ్యారు. భారీగా ఆస్తినష్టం సంభవించింది. ఎగువ కురుస్తున్న వర్షాలతో కృష్ణ నదికి భారీగా వరద నీరు రావడంతో విజయవాడ పూర్తిగా నీట మునిగిపోయింది. నేపధ్యంలో వరద భాదితుల సహాయార్థం కనీస అవసరాలు తీర్చేందుకు తెలుగు సినీ పరిశ్రమ ముందడుగు వేసింది. నిర్మాతలు, హీరోలు వరద భాదితులకు విరాళాలు అందిస్తున్నారు.
Also Read: RaoRamesh : మారుతి నగర్ కు మంచి లాభాలు.. మొత్తం ఎన్ని కోట్లో తెలుసా..?
నిర్మాత అశ్వనీదత్ రూ. 25 లక్షలు, యంగ్ టైగర్ ఎన్టీయార్ ఒక కోటి రు పాయలు, యంగ్ హీరో విశ్వక్ సేన్ 10 లక్షల రూపాయలు విరాళాలను సీఎం రిలీఫ్ ఫండ్ కు అందించారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ “గత కొద్ది రోజులుగా అటు ఆంధ్ర, ఇట్లు తెలంగాణ రాష్ట్రాలు ప్రకృతి వైపరీత్యాలతో తల్లడిల్లుతున్నాయి. ఈ నేపథ్యంలో సంయుక్తంగా 50 లక్షలు విరాళం ప్రకటిస్తున్నాము. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు ఎస్. రాధాకృష్ణ (చినబాబు), ఎస్. నాగవంశీ, ఏపీకి రూ.25 లక్షలు, తెలంగాణకు రూ.25 లక్షలు, ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తున్నామని మంగళవారం ప్రకటించారు. ‘భారీ వర్షాల వల్ల ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఆస్తి, ప్రాణ నష్టాలు మమ్మల్ని ఎంతగానో కలచి వేశాయి. ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ మా వంతు సాయంగా చేయూత అందిస్తున్నాము” అని అధికారక నోట్ విడుదల చేసారు .