Nabha Natesh throwing Party to Tollywood Media: కన్నడ భామ నభా నటేష్ కన్నడలో మూడు సినిమాలు చేసింది. తర్వాత సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన నన్ను దోచుకుందువటే అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచమైంది. ఇక ఆ తర్వాత తెలుగులో రవిబాబు అదుగో సినిమా కూడా చేసింది. ఇక ఆ తరువాత ఇస్మార్ట్ శంకర్ అనే సినిమాతో ఆమె సూపర్ హిట్ కొట్టింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. రామ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా తరువాత ఆమె కెరీర్ ఇక పరుగులు పెడుతుందని అనుకున్నారు అందరూ. కానీ అనూహ్యంగా ఆమెకు సరైన హిట్లు ఏమీ పడలేదు.
GOAT: భలే ఛాన్స్ పట్టేసిన మైత్రి మూవీ మేకర్స్
డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటరూ, అల్లుడు అదుర్స్, మాస్ట్రో అనే సినిమాల్లో నటించింది. ఆ తర్వాత ఆమెకు యాక్సిడెంట్ కావడంతో చాలా కాలం పాటు బెడ్ మీద ఉండి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత ఆమె హీరోయిన్గా డార్లింగ్ అనే సినిమా చేసింది. ప్రియదర్శి హీరోగా తమిళ్ దర్శకుడు అశ్విన్ రామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. హనుమాన్ నిర్మాతలు నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాని కూడా నిర్మించారు. జూలై 19వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతోంది. దీంతో తన రీ ఎంట్రీ సినిమా రిలీజ్ కు ముందు ఆమె తెలుగు సినీ మీడియాకి పార్టీ ఇచ్చేందుకు సిద్ధమైంది. రేపు హైదరాబాద్ లో ఒక హీరోకి చెందిన రెస్టారెంట్లో ఆమె తెలుగు సినీ మీడియాకి లంచ్ ఏర్పాటు చేసింది. తనను ఇన్నాళ్లుగా సపోర్ట్ చేస్తూ వచ్చిన తెలుగు సినీ మీడియాకి థాంక్స్ చెప్పేందుకే ఈ స్పెషల్ పార్టీ అని నభా సన్నిహితులు చెబుతున్నారు.