ప్రముఖ తమిళ దర్శకుడు ఎ.ఆర్. మురుగదాస్ ఓ క్రేజీ మల్టీస్టారర్ రూపకల్పనకు పథక రచన చేస్తున్నట్టు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. విశ్వనటుడు కమల్ హాసన్, ప్రిన్స్ మహేశ్ బాబు కాంబినేషన్ లో మురుగదాస్ ఓ సినిమా చేయాలనుకుంటున్నాడట. దానికి సంబంధించిన స్టోరీ లైన్ ఇద్దరికీ చెప్పాడని, వారి నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని మురుగదాస్ సన్నిహితులు చెబుతున్నమాట. విశేషం ఏమంటే… ఇప్పటికే మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్ బాబుస్పైడర్
చిత్రంలో నటించాడు. అది బాక్సాఫీస్ దగ్గర సరైన విజయాన్ని నమోదు చేసుకోలేదు. అయినా కూడా ఓ ఫిల్మ్ మేకర్ గా మురుగదాస్ అంటే ఇప్పటికీ మహేశ్ కు ఎంతో గౌరవం ఉందని అంటారు. అలానే తమిళ దర్శకుడు ఎస్.జె. సూర్య అన్నా కూడా మహేశ్ అదే అభిమానాన్ని కనబరుస్తూ ఉంటాడు. ఇక ఇటీవల రజనీకాంత్ హీరోగా మురుగదాస్ దర్బార్
మూవీని చేశాడు. కానీ కమల్ హాసన్ తో కలిసి ఇంతవరకూ పనిచేయలేదు. ఈ ప్రాజెక్ట్ వర్కౌట్ అయితే… వారిద్దరి కలయికలో ఇదే తొలి చిత్రం అవుతుంది. ఇందులో శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి సైతం ఓ కీలకపాత్ర పోషించబోతోందట. ఇదిలా ఉంటే ఈ మల్టీస్టారర్ లో మహేశ్ సీబీఐ ఆఫీసర్ గానటిస్తుంటే, ఓ అమ్మాయి తండ్రిగా తన వయసుకు తగిన పాత్రలో కమల్ హాసన్ కనిపించబోతున్నాడట. ప్రస్తుతం కమల్ హాసన్ తన సొంత చిత్రం విక్రమ్
తో పాటు, శంకర్ దర్శకత్వంలో ఇండియన్ -2
లో నటిస్తున్నాడు. ఆ రెండు సినిమాల తర్వాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ ఉందంటున్నారు.