Murari 4K Re-release Collects 5.4 crores Gross on Day 1: ఆగస్టు 9వ తేదీన మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మురారి అనే సినిమాని రిలీజ్ చేసిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే రోజున కొన్ని కొత్త సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. ముఖ్యంగా జగపతిబాబు ప్రధాన పాత్రలోని నటించిన సింబా సినిమాతో పాటు నిహారిక నిర్మించిన కమిటీ కుర్రోళ్ళు అనే సినిమా రిలీజ్ అయింది. అయితే ఈ క్రమంలోనే ఒక ఆసక్తికరమైన అంశం తెర మీదకు వచ్చింది. అదేంటంటే మురారి సినిమాని రీ రిలీజ్ చేస్తే ఒక్క రోజులో ఐదు కోట్ల 4 లక్షల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. అయితే నిహారిక కమిటీ కుర్రోళ్ళు సినిమాకి కేవలం కోటి 63 లక్షలు వచ్చాయి.
Naga Chaitanya: ఎంగేజ్మెంట్ అయిన రెండ్రోజులకే అంత దూరమెళ్లిన చైతూ
సింబ సినిమా యూనిట్ అయితే అసలు కలెక్షన్స్ ప్రకటించలేదు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు అంటే రీ రిలీజ్ సినిమాలకు ప్రేక్షకులు ఎంత ఆసక్తి చూపిస్తున్నారో ఈ మురారి సినిమాతో అర్థం చేసుకోవచ్చని ట్రేడ్ అనలిస్టులు కామెంట్ చేస్తున్నారు. అయితే రీ రిలీజ్ చేసిన అన్ని సినిమాలు ఈ రేంజ్ లో కలెక్షన్స్ రాబట్ట లేక పోతున్నాయి. కొన్ని సినిమాలకు మాత్రమే ఈ స్థాయిలో కలెక్షన్స్ వస్తున్నాయి అని కూడా వారు చెబుతున్నారు . కాబట్టి రీ రిలీజ్ చేస్తున్న నిర్మాతలు ఎక్కువ ఖర్చు పెట్టకుండా రిలీజ్ చేస్తే ఏమైనా ఉపయోగం ఉండే అవకాశం ఉందని అంటున్నారు.