Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!
- టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్
- మృణాల్ నటించిన తాజా చిత్రం డెకాయిట్
- ఆసక్తికర విషయాలు చెప్పిన హాయ్ నాన్న దర్శకుడు శౌర్యువ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరంటే అందరూ చెప్పే పేరు ‘మృణాల్ ఠాకూర్’. ‘సీతారామం’తో తెలుగు వారి గుండెల్లో ‘సీత’గా గూడు కట్టుకున్న ఈ మరాఠీ భామ.. ఆ తర్వాత ‘హాయ్ నాన్న’తో మరో క్లాసిక్ హిట్ అందుకున్నారు. ‘ది ఫ్యామిలీ స్టార్’లో అద్భుతంగా నటించిన మృణాల్.. కల్కిలో చిన్న కామియో పాత్రలో మెరిశారు. అయితే రెండు ఘన విజయాలు అందుకున్నప్పటికీ.. మృణాల్ మనసులో ఒక చిన్న భయం ఎప్పుడూ వెంటాడుతూనే ఉండేదట. ఈ విషయాన్ని తాజాగా ‘హాయ్ నాన్న’ దర్శకుడు శౌర్యువ్ బయటపెట్టారు.
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన యాక్షన్ ప్రేమకథా చిత్రం ‘డెకాయిట్’. షనీల్ దేవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈరోజు చిత్ర యూనిట్ డెకాయిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు శౌర్యువ్.. మృణాల్ మురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. ‘హాయ్ నాన్న సినిమా చిత్రీకరణ సమయంలో మృణాల్ అప్పుడప్పుడు ఫోన్ చేసేది. ఇక నా వల్ల కాదు.. తెలుగు ప్రేక్షకులు నన్ను యాక్సెప్ట్ చేయరు ఏమో అని బాధపడేది. భాషా పరమైన ఇబ్బందులు, పాత్రలో ఒదిగిపోయే క్రమంలో వచ్చే ఒత్తిడి ఏమో తెలియదు కానీ.. ఇక నేను టాలీవుడ్‌లో సినిమా చేయను, ఇదే లాస్ట్ అని చెప్పేది. ఆమె మాటలు నేను పెద్దగా పట్టించుకోలేదు’ అని శౌర్యువ్ చెప్పారు.
Also Read
- Hushar Pittalu : నిజమా కలా? అంటూ స్టేజ్ మీద లైవ్‌లో పొట్టు పొట్టు కొట్టుకున్న నటుడు!
- Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
- RGV: ఆర్జీవీకి జేడీ షాకింగ్ ప్రశ్న.. “పిచ్చోళ్లందరినీ మీరు పెట్టుకుంటారా? లేక వాళ్లే వస్తారా?”
- JD Chakravarthy: ఆర్జీవీకి తెలియకుండా జేడీ చేసిన పని.. కోన వెంకట్‌కు అలా కలిసి వచ్చిందా?
‘హాయ్ నాన్న సినిమా విడుదలయ్యాక తెలుగు ప్రేక్షకులు మృణాల్ ఠాకూర్ నటనకు ఫిదా అయ్యారు. యష్ణ పాత్రకు విశేషమైన గుర్తింపు లభించింది. ఇప్పుడు ఆమెను ఒక ‘లోకల్ స్టార్’లా ఆదరిస్తున్నారు. డెకాయిట్ కూడా మంచి విజయం అందుకుంటుంది. టాలీవుడ్‌లో నీకు అవకాశాలు వెల్లువెత్తుతాయి. టాలీవుడ్ నుంచి నువ్ తప్పించుకోలేవు. తెలుగులో మంచి పాత్రలు వస్తాయి’ అని దర్శకుడు శౌర్యువ్ ధీమా వ్యక్తం చేశారు. హాయ్ నాన్న సినిమాలో చివరలో ఫైట్ చేసిందని, డెకాయిట్లో ఆది నుంచే సరస్వతిగా ఫైట్ చేస్తుందన్నారు. డెకాయిట్ రూపంలో మరో హిట్ మృణాల్ ఖాతాలో పడుతుందని శౌర్యువ్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Spirit: స్పిరిట్ షూటింగ్’కి నెల రోజుల బ్రేక్
-
Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్‌గాంధీని ప్రశ్నించిన బీజేపీ
-
Team India: బీసీసీఐ కార్యదర్శికి అస్వస్థత.. టీమిండియా ఫ్యూచర్ ప్లాన్ వాయిదా..
-
Hushar Pittalu : నిజమా కలా? అంటూ స్టేజ్ మీద లైవ్‌లో పొట్టు పొట్టు కొట్టుకున్న నటుడు!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ‘వాటర్ బాయ్’గానే.. మేనేజ్మెంట్ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!