సీతారామంతో తెలుగు ఆడియన్స్ మదిలో సీతామమహాలక్ష్మీగా పర్మినెంట్ స్టాంప్ వేయించుకుంది మృణాల్ ఠాకూర్. సీరియల్ యాక్టర్ నుండి హీరోయిన్‌గా ఛేంజ్ అయితే.. సీతగా స్పెషల్ ఐడెంటిటీనిచ్చింది టీటౌన్. హాయ్ నాన్నతో సెకండ్ హిట్ ఖాతాలో వేసుకున్న భామకు ఫ్యామిలీ స్టార్ రూపంలో హ్యాట్రిక్ మిస్సయ్యింది. కల్కిలో క్యామియో అప్పీరియన్స్ ఇచ్చిన భామ.. టాలీవుడ్ ఆడియన్స్‌కు గ్యాప్ ఇచ్చినా.. బాలీవుడ్ ప్రేక్షకులతో టచ్ కంటిన్యూ చేస్తోంది. ఈ ఏడాది జస్ట్ వన్ ఫిల్మ్స్ సన్నాఫ్ సర్దార్2తో సరిపెట్టేసింది అమ్మడు. ఈ బొమ్మ కూడా బాక్సాఫీస్ దగ్గర అండర్ ఫెర్మామెన్స్ చేసింది.
రెండేళ్ల నుండి అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో హిట్ లేక స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న మృణాల్.. తనకు బాగా అచ్చొచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీలతో నెక్ట్స్ ఇయర్ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ట్రై చేస్తోంది. 2026 స్టార్టింగ్ నుండే బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో సందడి చేయబోతోంది. తెలుగు, హిందీ బైలింగ్వల్ మూవీ డెకాయిట్: ఒక ప్రేమ కథ.. ఈ ఇయర్ ఎండింగ్ రిలీజ్ కావాల్సి ఉండగా.. నెక్ట్స్ ఇయర్ మార్చి 19కు పోస్ట్ పోన్ చేసుకుంది. అంత కన్నా ముందే మరో బాలీవుడ్ లవ్ స్టోరీతో హాయ్ చెప్పబోతోంది అమ్మడు. రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న దో దీవానీ షెహర్ మే ఎట్టకేలకు రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ నిర్మాతగా వ్యవహరిస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ దో దీవానీ షెహర్ మే నెక్ట్స్ ఇయర్ వాలంటైన్స్ డేను టార్గెట్ చేస్తూ ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే జూన్ 5న హాయ్ జవానీ తో ఇష్క్ హోనా హైతో హాయ్ చెప్పబోతుంది. వరుణ్ ధావన్,పూజా హేగ్డే, మృణాల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీగా రాబోతుంది ఈ ఫిల్మ్. అలాగే ఎప్పుడో కంప్లీటై విడుదలకు నోచుకోని కాంట్రవర్షీయల్ సబ్జెక్ట్ మూవీ పూజా మేరీ జాన్ కూడా నెక్ట్స్ ఇయరే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది మడాక్ ఫిల్మ్స్. అలాగే బన్నీ- అట్లీ హై బడ్జెట్ ఫిల్మ్ కూడా రిలీజయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఈ మూవీ పోస్టు పోనైనా.. ఫోర్ లవ్ స్టోరీస్ తో సీతామహాలక్ష్మీ సందడి చేయడం పక్కా