Mr bachchan: గురూజీ క్యారక్టర్ తో అవమానించిన హరీష్.. ఎవరినో తెలుసా..
- గ్రాండ్ రిలీజైన మిస్టర్ బచ్చన్
- రకరకాలుగా స్పందిస్తున్న నెటిజన్స్
- తళుక్కున మెరిసిన పలువురు స్టార్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొత్తానికి మాస్ మహారాజ రవితేజ – హరీశ్ శంకర్ మాస్ యాక్షన్ చిత్రం మిస్టర్ బచ్చన్ థియేటర్లలోకి దిగింది. బుధవారం పైడ్ ప్రీమియర్స్ తో వరల్డ్ వైడ్ గా గగ్రాండ్ గా రిలీజ్ అయింది. బాలీవుడ్ లో అజయ్ దేవగన్ నటించిన ‘రైడ్’ అఫీషియల్ రీమేక్ ఈ మిస్టర్ బచ్చన్ . పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై TG. విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించారు. ఈ సినిమాపై రకరకాల రివ్యూస్ వచ్చాయి.
Also Read : Rajni : తెలుగు సినిమాకు నో చెప్పిన తమిళ సూపర్ స్టార్.. కారణాలు బోలెడు..
Also Read
కాసేపు రివ్యూస్ ని పక్కన పెడితే ఈ సినిమాలోని ఓ క్యారక్టర్ పై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తుంది. సినిమాలో గురూజీ అనే పేరుతో ఒక క్యారెక్టర్ ని సృష్టించాడు హరీష్ శంకర్. అయితే ఈ రోల్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ను ఉద్దేశించి పెట్టినట్టు ఉందని కావాలనే త్రివిక్రమ్ మీద పంచులు వేయించినట్టు అనిపించిందని చర్చించుకుంటున్నారు నెటిజన్స్. సినిమాలో ఆ క్యారక్టర్ ను ప్రభాస్ శ్రీను తో వేయించాడు దర్శకుడు. అతనికి శ్రీనివాస్ అనే పేరు కూడా పెట్టడం యాదృచ్ఛికమో లేక కాకతాళీయమో తెలియదు కానీ హరీష్ పై త్రివిక్రమ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అది చాలదన్నట్టు మాంత్రికుడు అనే పదం మీద కూడా రవితేజ చేత కొన్ని పంచ్ డైలాగ్ లు వేయించాడు దర్శకుడు హరీష్. అయితే ఈ క్యారక్టర్ ఓ ప్రముఖ జర్నలిస్ట్ ను ఉద్దేశించి పెట్టారని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. 4 సినిమాల మధ్య పోటీగా లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ తో రిలీజైన మిస్టర్ బచ్చన్ పోటీని తట్టుకుని ఏ మేరకు కలెక్షన్స్ రాబడతాడో వీకెండ్ ముగిస్తే కానీ తెలియదు.
తాజావార్తలు
-
PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
-
CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
-
Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
-
Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..