టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సినిమా ఎప్పుడో రావాల్సింది. మాస్ మహారాజ హీరోగా అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన రాజా ది గ్రేట్ సినిమాలో మొదటి అనుకున్న హీరో రామ్ పోతినేని. కానీ వేర్ ఇతర కారణాల వలన రామ్ ఆ సినిమా నుండి తప్పుకున్నాడు. అన్నట్టు రామ్ సూపర్ హిట్ సినిమా కందిరీగకు అనిల్ రావిపూడి అసిస్టెంట్ దర్శకుడిగా రిటైర్ గా కూడా పని చేసాడు.
Also Read : Akhanda2 : అఖండ 2.. థియేట్రికల్ రైట్స్.. బాలయ్య కెరీర్ బెస్ట్
రాజా ది గ్రేట్ తో మిస్ అయిన ఈ కాంబో మరోసారి మళ్ళి సెట్ కాబోతుందని ఇటీవల గాసిప్ లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. చిరుతో సినిమా తర్వాత అనిల్ రావిపూడి నెక్ట్స్ సినిమా రామ్ హీరోగా ఉంటుందని వార్తలు వెలువడ్డాయి. ఈ నేపధ్యంలో రామ్ తో సినిమా చేసే విషయమై అనిల్ రావిపూడి స్పందిస్తూ ‘ మా ఇద్దరి కాంబోలో సినిమా ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఎప్పుడు వచ్చిన బద్దలవుతుంది’. అని అన్నారు. రాబోయే రోజుల్లో అనిల్ రావిపూడి. రామ్ పోతినేని కాంబోలో సినిమా తప్పకుండా ఉంటుందని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక రామ్ నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా ఈ నెల 27న రిలీజ్ కు రెడీ అయింది. వరుస ప్లాపులతో సతమతమవుతున్న రామ్ ఈ సినిమాతో ఖచ్చితంగా హిట్ కొడతానని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అటు అనిల్ రావిపూడి ప్రస్తుతం మెగాస్టార్ చిరుతో మన శంకరవరప్రసాద్ సినిమా చేస్తున్నాడు. మరి ఈ ఇద్దరి కాంబోలో సినిమా ఎప్పడు వస్తుందో. ఎప్పుడు వచ్చిన సరే బద్దలవడం మాత్రం ఖాయం.