సౌత్ స్టార్స్ కిచ్చ సుదీప్, ఉపేంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన ఇంటెన్సివ్ యాక్షన్ థ్రిల్లర్ “కబ్జా”. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేయనున్నారు. ఉపేంద్ర, సుదీప్ ఇద్దరూ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. టాలీవుడ్ కు వారి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సుదీప్ “ఈగ” చిత్రంతో తెలుగులోనూ అభిమానులను సంపాదించుకున్నారు. ఇందులో ఆయన విలన్ గా నటించారు. ఇక సీనియర్ కన్నడ స్టార్ హీరో, రియల్ స్టార్ ఉపేంద్ర ఆయన సినిమాలతో తెలుగులో అభిమానులను సంపాదించుకున్నారు. ఉపేంద్ర చివరిసారిగా తెలుగులో “సన్నాఫ్ సత్యమూర్తి” చిత్రంలో ఓ కీలక పాత్రలో కన్పించారు.
Read Also : కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్
తాజాగా వీరిద్దరూ కలిసి నటిస్తున్న భారీ యాక్షన్ మూవీ “కబ్జా” మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. “ఎ న్యూ విజన్ అఫ్ ది అండర్ వరల్డ్” అంటూ మేకర్స్ విడుదల చేసిన ఈ మోషన్ పోస్టర్ యాక్షన్ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఆర్ చంద్రు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చంద్రశేఖర్ నిర్మిస్తున్నారు. విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.