Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Mokshagna Teja Nandamuri Mokshagnas Second Film Fix Who Is The Director

Mokshagna Teja : నందమూరి మోక్షజ్ఞ రెండవ సినిమా ఫిక్స్.. దర్శకుడు ఎవరంటే..?

Published Date :December 2, 2024 , 7:47 am
By subbarao kilari
  • బాలయ్య వారసుడి టాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్
  • డిసెంబరు 5న పూజా కార్యక్రమాలు
  • రెండవ సినిమాను లాక్ చేసిన మోక్షజ్ఞ
Mokshagna Teja : నందమూరి మోక్షజ్ఞ రెండవ సినిమా ఫిక్స్.. దర్శకుడు ఎవరంటే..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

నందమూరి బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఞ లాంఛ్ అవుతున్నాడు. సెప్టెంబరులో మోక్షజ్ఞ పుట్టిన రోజు కానుకగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. భారతీయ పురాణ ఇతిహాసాల నేపథ్యంలో సినిమా ఉండనుందని టాలీవుడ్ టాక్. SLV బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి అలాగే నందమూరి తేజస్విని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఈ డిసెంబరు 5న జరగనున్నాయి.

ఇక నందమూరి  అభిమానులకు మరో గుడ్ న్యూస్ వినిపిస్తుంది.  మొదటి సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవకముందే నందమూరి మోక్షజ్ఞ రెండవ సినిమా కు సంబందించిన అప్ డేట్ తెలుస్తోంది. ఈ ఏడాది దీపావళి కానుకగా విడుదలైన లక్కీ భాస్కర్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో మోక్షు సెకండ్ సినిమాను ఫిక్స్ అయిందట. ఇందుకు తగ్గ కథ,కథనాల చర్చలు కూడా ముగిశాయట. ఈ సినిమాను ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారని తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాను అధికారకంగా ప్రకటిస్తారట. ప్రస్తుతం ఇదే బ్యానర్ లో నందమూరి బాలయ్య హీరోగా బాబీ దర్శకత్వంలో ‘డాకు మహారాజ్’ చేస్తున్న సంగతి విదితమే. వచ్చే ఏడాదిసంక్రాంతి కానుకగా జనవరి 14న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Nagavamsi
  • Nandamuri Mokshagna
  • Nandamuri Mokshagna movie update
  • NandamuriMokshagna
  • VenkyAtluri

తాజావార్తలు

  • Muse Spark: AIలో మార్క్ జుకర్‌బర్గ్ ప్రయోగం.. గూగుల్‌, ఓపెన్‌ఏఐకు ‘మ్యూస్ స్పార్క్’ సవాల్‌..

  • David Miller: “ఓటమికి కారణం నేనే”.. స్టేడియంలోనే ఏడ్చేసిన డేవిడ్ మిల్లర్.. హృదయాలను గెలిచిన అక్షర్!

  • Indian Bank Vacancy 2026: ఇండియన్ బ్యాంక్ స్పెషలిస్ట్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తులు ప్రారంభం.. భారీ జీతం

  • Stock Market: ఒక్కరోజు లాభాలు ఆవిరి.. భారీ నష్టాల్లో కొనసాగుతోన్న సూచీలు

  • Nara Lokesh: ఇది తెలుగుదేశం 3.0 వర్షన్.. పైరవీలతో పనిలేదు..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions