టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ గురించి పరిచయం అక్కర్లేదు. బాలనటుడిగా ఎన్నో సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న తేజ ప్రజంట్ హీరోగా ఎంట్రీ ఇచ్చి, కెరీర్ ఆరంభంలోనే ‘హనుమాన్’ మూవీ తో పాన్ ఇండియా రెంజ్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ‘మిరాయ్’ మూవీతో రాబోతున్నాడు తేజ. మానవాళికి సవాల్‌గా మారిన ఒక అంతుచిక్కని రహస్యం కోసం సాహస యాత్రలు చేసే యువకుడిగా ఆయన ఈ మూవీలో కనిపించనున్నట్టు వినికిడి. ఇక మార్కెట్ ఎంతనేది కాకుండా కంటెంట్‌ని నమ్మి పీపుల్స్ మీడియా ఈ చిత్రం పై వంద కోట్లకు పైగా పెడుతోందట.
Also Read:Chiranjeevi : చిరంజీవి-శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్టుపై నాని కామెంట్స్ వైరల్ ..
అతేకాదు ప్రభాస్ ‘రాజా సాబ్’, ‘మిరాయ్’ ఈ రెండు ప్యాన్ ఇండియా మూవీస్‌ని ఒకేసారి సెట్స్ మీద పెట్టిన పీపుల్స్ మీడియా, వీటి మీద అయిదు వందల కోట్లకు పైగా బడ్జెట్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇక కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియాడిక్ ఫాంటసీ డ్రామా ఆగస్టు 1న ప్యాన్ ఇండియా భాషలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైన లాంగ్వేజెస్‌లో ‘మిరాయ్’ విడుదల కానుందట. విజువల్స్ కూడా అబ్బురపరిచేలా ఉంటాయని టాక్. అయితే ఇందులో మంచు మనోజ్ విలన్‌గా చేయడంతో మూవీపై అంచనాలు ఆల్రెడీ పెరిగిపోగా.. తాజాగా దగ్గుబాటి రానా కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్నట్లు సమాచారం. నిజానికి ఈ క్యారెక్టర్‌కు ముందు దుల్కర్ సల్మాన్‌ని అనుకున్నారట, కానీ డేట్స్ తదితర సమస్యల వల్ల ఆ స్థానంలో రానా వచ్చినట్టు తెలుస్తోంది.