ప్రజెంట్ ఇప్పుడు అంత సీనియర్ హీరోల హవా నడుస్తోంది.. యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా రాజకీయాల నుంచి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి 8 ఏళ్లు గడిచిపోయింది. కానీ చిరు నుంచి అంతటి భారీ హిట్ అయితే స్క్రీన్ మీద కనిపించలేదు. ఆయన రెంజ్‌కి తగ్గా మాస్ సినిమా అయితే రాలేదు. గతేడాది ‘భోళా శంకర్’ కూడా ఫ్యాన్స్ చాలా నిరాశపరిచింది. ఇక ఎప్పుడైతే చిరంజీవి ‘దసరా’ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, అనీల్ రావిపుడి వంటి యంగ్ డైరెక్టర్స్‌తో వరుస ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తున్నారో అప్పటి నుంచి మెగా ఫ్యాన్స్‌కి ఓ నమ్మకం వచ్చేసింది..
Also Read: Shalini Pandey : నన్ను అలియాతో పోల్చడం నచ్చలేదు..
ఇక ఇందులో అనిల్‌తో ఎంటర్టైనింగ్ మూవీ రాబోతున్నప్పటికి.. శ్రీకాంత్ ఓదెల తో చిరంజీవి చేయబోయే ప్రాజెక్టు మాత్రం చాలా వయిలెంట్ గా ఉండబోతుంది. పైగా ఈ చిత్రాన్ని హీరో నాని నిర్మిస్తుండటం మరో విశేషం. అయితే తాజాగా ఈ మూవీ గురించి నాని ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.. ‘చిరంజీవి గారు అనగానే డ్యాన్స్, యాక్షన్ అని ఒక అభిప్రాయానికి వచ్చేశాం. కానీ ఆయన అంతకు మించి. చిరంజీవి కేవలం అది మాత్రమే కాదు. ఆయన్ని ప్రతి ఫ్యామిలీలో ఒక మెంబర్‌గా భావిస్తాం. కానీ ఆ విషయాన్ని మనం మర్చిపోయి వేరే దేనిపైన ఫోకస్ చేస్తున్నాం. ఇప్పుడు శ్రీకాంత్ తో ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇది నిజంగా నాకు ఓ గర్వకారణం. అసలు నా లైఫ్‌లో చిరంజీవి గారిని పెట్టి నేను ఓ సినిమా తీస్తానని ఎప్పుడూ ఊహించలేదు. కానీ అనుకోకుండా ఇది కుదిరింది. ఇది గొప్ప బాధ్యతగా భావిస్తున్నా. ఖచ్చితంగా ది బెస్ట్ ఇస్తాం . ఆయన అభిమానులను తృప్తిపరుస్తాము’ అంటూ నాని తెలిపారు.