విక్కీతో సినిమా అంటే హిట్ గ్యారెంటీ అనే టాక్ బాలీవుడ్‌లో క్రియేట్ అయ్యింది. యురి నుండి రీసెంట్లీ వచ్చిన ఛావా వరకు వరుస విజయాలతో జోరు చూపిస్తున్నాడు. వేటికవే డిఫరెంట్ స్టోరీలు, డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలు. ఇక చత్రపతి శివాజీ మహారాజ్ స్టోరీతో వచ్చిన చావా తన కెరీర్‌లోనే హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది. అంతేకాదు ఏడాదిలో ఇప్పటి వరకు చావా కలెక్షన్లను రీచైన మూవీ రాలేదు. కూలీ, వార్2 బ్రేక్ చేస్తాయనుకుంటే.. వాటికవే బ్రేకులేసుకున్నాయి.
Also Read : Vishal : అప్పట్లో ఆ భామలతో ప్రేమలు.. ఇప్పడు ఈ భామతో మూడు ముళ్ళు..
విక్కీ కౌశల్ ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో లవ్ అండ్ వార్ చేస్తున్నాడు. రణబీర్, ఆలియా భట్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. వార్ బ్యాక్ డ్రాప్‌లో లవ్ స్టోరీగా తీసుకురాబోతున్నాడు భన్సాలీ. రణబీర్, విక్కీ ఆర్మీ అధికారులుగా కనిపించబోతున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇక సంజయ్ లీలా భన్సాలీ సంగతి తెలిసిందేగా మన జక్కన్న చెక్కినట్లు చెక్కుతుంటాడు. అందుకే ఈ ఏడాది క్రిస్మస్ బరిలో రిలీజ్ కావాల్సిన ఈ బొమ్మ.. నెక్ట్స్ ఇయర్ మార్చికి పోస్ట్ పోన్ అయ్యింది. సంజయ్ లీలా భన్సాలీ వల్ల విక్కీ కౌశల్ నెక్ట్స్ మూవీ మహావతార్‌పై ఎఫెక్ట్ చూపిస్తోంది. చిరంజీవి పరుశురామ్ స్టోరీని తెరకెక్కిస్తోంది మడాక్ ఫిల్మ్స్. అమర్ కౌశిక్ దర్శకత్వంలో వస్తోన్న ఈ మైథాలజీ ఫిల్మ్స్‌ను నెక్ట్స్ ఇయర్ క్రిస్మస్ బరిలో దింపుతామని ఎనౌన్స్ చేశారు మేకర్స్. అయితే ఇప్పటి వరకు సినిమా సెట్స్‌పైకి అడుగుపెట్టలేదట. లవ్ అండ్ వార్‌కు విక్కీ కమిట్ అవ్వడం వల్ల.. ఈ ప్రాజెక్ట్ నెక్ట్స్ ఇయర్ ఏప్రిల్ నుండి స్టార్ట్ కాబోతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కన చూస్తే.. నెక్ట్స్ ఇయర్ ఎండింగ్‌కు కూడా ఈ సినిమా వచ్చే ఛాన్స్ లేదని టాక్.