టాలీవుడ్ హాట్ బ్యూటీ మెహరీన్ కౌర్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ కథనాలు పెద్ద చర్చకు దారితీశాయి. తనకు అసలు పరిచయం లేని ఒక XYZ వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు కొన్ని ఆర్టికల్స్ రాయడం, ఆ వార్తలు వైరల్ అవ్వడంతో మెహరీన్ తీవ్ర మనస్తాపానికి గురైంది. నిరంతర వేధింపులు ఎక్కువ అవ్వడంతో, ఆమె స్వయంగా సోషల్ మీడియాలో స్పందించింది. తన వికీపీడియా పేజీని ఎవరో హ్యాక్ చేసి, ‘రెండు నిమిషాల పాపులారిటీ’ కోసం ఈ తప్పుడు సమాచారాన్ని చేర్చారని ఆమె చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండేళ్లుగా సైలెంట్‌గా ఉన్నప్పటికీ, ఈసారి వేధింపులు హద్దులు దాటడంతో ఇప్పుడైనా నిజం చెప్పక తప్పలేదంది.
Also Read : Bigg Boss 9: ట్రోఫీ తనుజదేనా..? గ్రాండ్ సపోర్ట్ పోస్ట్‌లతో హోరెత్తుతున్న సోషల్ మీడియా.. !
ఈ పోస్ట్‌లో మెహరీన్ చాలా క్లారిటీగా ఒక విషయం చెప్పింది – “నేను ఇప్పటివరకు ఎవరినీ వివాహం చేసుకోలేదు” అని, భవిష్యత్తులో పెళ్లి చేసుకునే నిర్ణయం తీసుకుంటే, అది తానే అధికారికంగా ప్రపంచానికి చెబుతానని హామీ ఇచ్చింది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసిన వ్యక్తి ఇకపై తనను జర్నలిస్ట్‌గా పిలవకూడదంటూ ఘాటుగా విమర్శించింది. తన పర్సనల్ లైఫ్ గురించి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగేది తానే అని స్ట్రాంగ్‌గా చెప్పడంతో, ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇలా యాదృచ్ఛిక వ్యక్తులు తన వ్యక్తిగత జీవితంపై తప్పుడు ఎడిట్లు చేయకుండా చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది.
IMPORTANT!!!
Nowadays it’s bizzare how misinformation can spread without any repercussions for it. And journalism has definitely taken a hit when it comes to stupid paid articles. I’ve stayed shut about this for 2 years but because of constant harassment I choose to speak up…
— Mehreen Pirzada👑 (@Mehreenpirzada) December 16, 2025