Megastar Chiranjeevi Met Chandrababu Naidu at His Residence: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా ఈ రోజు హైద్రాబాద్ లోని ఆయన నివాసం లో కలిశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలతో వరదలు సంభవించి ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమ తమ వంతుగా ప్రభుత్వానికి మద్ధతుని ప్రకటిస్తూ విరాళాలను అందజేసింది. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న ప్రతీసారి సినీ పరిశ్రమ నుంచి తన వంతు మద్ధతుని చిరంజీవి అండ్ ఫ్యామిలీ తెలియచేస్తుంటుందనే సంగతి తెలిసిందే.
Game Changer: సంక్రాంతికి ‘గేమ్ ఛేంజర్’.. రిలీజ్ డేట్ చెప్పేశారు!
ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ కలిసి తెలుగు రాష్ట్రాలకు తలో కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా చంద్రబాబు నాయుడుని కలిసిన చిరంజీవి తన యాబై లక్షల రూపయాల చెక్‌తో పాటు, రామ్ చరణ్ యాబై లక్షల రూపాయల చెక్‌ను.. మొత్తం కోటి రూపాయల చెక్‌లను అందజేశారు.