తెలుగు సినిమా పరిశ్రమలో ఎప్పటికీ చెక్కుచెదరని క్లాసిక్‌గా నిలిచిన చిత్రం ‘మాయాబజార్’. 1957 మార్చి 27న ఆంధ్ర దేశంలో విడుదలై సంచలన విజయం సాధించిన ఈ చిత్రం, నేటికీ 68 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఎన్.టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్.వి. రంగారావు, సావిత్రి, రేలంగి, గుమ్మడి, ముక్కామల, మిక్కిలినేని, అల్లు రామలింగయ్య, ఆర్. నాగేశ్వర రావు, సూర్యకాంతం, రమణా రెడ్డి వంటి దిగ్గజ నటులు ఈ పౌరాణిక చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు.
Also Read:Lawyer: ‘లాయర్’ అవతారమెత్తిన విజయ్ ఆంటోనీ
విజయా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నాగిరెడ్డి, చక్రపాణి నిర్మించిన ‘మాయాబజార్’ను దర్శకుడు కె.వి. రెడ్డి అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని ఒక సెల్యులాయిడ్ కావ్యంగా, అనూహ్యమైన విజువల్ అనుభవంగా రూపొందించారు. పింగళి నాగేంద్ర రావు రచించిన అద్భుతమైన మాటలు, ఛాయాగ్రాహకుడు మార్కస్ బార్ట్‌లీ నవరస భరితమైన సన్నివేశాల చిత్రీకరణ, ఘంటసాల సంగీత దర్శకత్వంలో రూపొందిన పాటలు ఈ చిత్రాన్ని ఈ తరం ప్రేక్షకులను సైతం ఆకట్టుకునేలా చేశాయి. శ్రీకృష్ణుడిగా ఎన్.టి. రామారావు, ఘటోత్కచుడిగా ఎస్.వి. రంగారావు, శశిరేఖగా సావిత్రి, అభిమన్యుడిగా అక్కినేని నాగేశ్వరరావు తమ పాత్రలను సజీవంగా పోషించి ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.
Also Read:Raashi Khanna : షూటింగ్‌లో గాయపడ్డ హీరోయిన్..
ఈ గొప్ప చిత్రాన్ని మహానటుడు ఎన్.టి. రామారావు 102వ జయంతి సందర్భంగా, మే 28, 2025న బలుసు రామారావు కలర్ వెర్షన్‌లో మళ్లీ విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథులుగా టి.డి. జనార్దన్, రమేష్ ప్రసాద్, ఎస్.వి. కృష్ణారెడ్డి, అచ్చి రెడ్డి, దర్శకుడు వీర శంకర్, భగీరథ, వై.జె. రాంబాబు, త్రిపురనేని చిట్టి తదితరులు పాల్గొన్నారు.