కన్నడలో సక్సెసైన హీరోయిన్ల ఫస్ట్ ఛాయిస్ టాలీవుడ్. అక్కడ సక్సెసైన వెంటనే ఇక్కడ వాలిపోతున్నారు. అక్కడ నుండి ఇక్కడ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లలో ఎంతో మంది భామలు ఫేమ్ తెచ్చుకున్నారు. కానీ రచితా రామ్ కు మాత్రం టాలీవుడ్ అచ్చి రాలేదు. శాండిల్ వుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తర్వాత కళ్యాణ్ దేవ్ హీరోగా వచ్చిన సూపర్ మచ్చిలో నటించే ఛాన్స్ కొల్లగొట్టింది. కానీ మూవీ ఆశించిన విజయాన్ని అందుకోలేదు. శాండిల్ వుడ్ లో సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ పడటంతో హీరోలకు లేడీ లక్కుగా మారింది.
Also Read : HHVM : హరిహర వీరమల్లు సెకండ్ లిరికల్ సాంగ్ రిలీజ్ డేట్ ఇదే
అదేటైంలో టాలీవుడ్ పిలిచింది. కానీ ఇక్కడ సక్సెస్ కాలేక మళ్లీ శాండిల్ వుడ్ వెళ్లిపోయి తన హవాను కంటిన్యూ చేస్తుంది. పరుగెత్తి పాలు తాగడం ఎందుకు నిలబడి నీళ్లు తాగుదామని ఫీల్ అవుతోంది. తాను ఊహించినట్లే అమ్మడి ఖాతాలో సినిమాలు క్యూ కడుతున్నాయి. ప్రెజెంట్ అమ్మడి చేతిలో ఆరు క్రేజీ సినిమాలున్నాయి. రీసెంట్లీ హిట్టు బొమ్మ సీక్వెల్ సంజు వెడ్స్ గీత 2లో కనిపించింది. కానీ ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అయినా అమ్మడికి పోయిందేమీ లేదు. ఆమె చేస్తున్న ప్రాజెక్టుల్లో ఒక్కటి బ్లాక్ బస్టర్ కొట్టినా మరీ నేమ్ ఈజీగా వచ్చేస్తుంది. ఫీమేల్ ఓరియెంట్ మూవీ శబరి సెర్చింగ్ ఫర్ రావణతో పాటు డార్లింగ్ కృష్ణతో లవ్ మీ ఆర్ హేట్ మీ కంప్లీట్ కాగా, అయోగ్య 2, కల్ట్, రాచయ్య, దునియా విజయ్ తో ల్యాండ్ లార్డ్ చేస్తోంది. ఇవన్నీ సెట్స్ పై ఉన్నాయి. ఈ లైనప్స్ చూస్తే పొరుగింట్లో కాదు సొంతింట్లో కూడా నేమ్ ఫేమ్ తెచ్చుకోవచ్చునని ఫ్రూవ్ చేస్తోంది.