తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. విలక్షణ నటుడిగా అన్ని భాషల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోగా మాత్రమే కాకుండా ఎలాంటి పాత్ర అయిన పడించగల సతా ఉన్నవాడు. ముఖ్యంగా విలన్‌గా విజయ్ యాక్టింగ్‌కి విపరీతమైనా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ‘ఏస్’సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విజయ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ తొలి రోజుల్ని గుర్తుచేసుకున్నారు.
Also Read : Samantha : సమంత, రాజ్ పై శ్యామలి మరో పోస్ట్ ..!
విజయ్ మాట్లాడుతూ.. ‘ కెరీర్ బిగిన్నింగ్‌లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ‘వర్ణం’ అనే సినిమాకు ఆడిషన్‌కు వెళ్లాను. తీరా అక్కడికి వెళ్లాక సీన్ చెప్పి డైలాగులు కూడా నన్నే రాసుకొని నటించమన్నారు. అప్పుడే తెలుసుకున్న నేను డైలాగులు కూడా రాయగలనని. ఆర్ముగ కుమార్ ఆ టీమ్‌కు నా పేరు సజెస్ట్ చేశారు. అలా ఆ సినిమాలో అవకాశం వచ్చింది. అలాగే క్లాసిక్ మూవీ ‘96’లో నేను నటించడానికి కూడా ఆయనే కారణం. ‘ఒకసారి ఈ సినిమాకు విజయ్ సేతుపతి ఆడిషన్ తీసుకోండి. పాత్రకు సరిపోడు అనుకుంటే తిరస్కరించండి’ అని ఆర్ముగ కుమార్ ‘96’ టీమ్‌కు చెప్పారు. మనం అంటూ ఒక స్థాయి వచ్చాక ఎవరైనా సహాయం చేయడానికి ముందుంటారు. కానీ మనం ఎవరో తెలియనప్పుడు కూడా సహాయం చేయడం గొప్ప. ఆ సాయం చీకటితో నిండిన ఇంట్లో దీపం వెలిగించడం లాంటింది. అలా నా జీవితంలో ఆ దీపాన్ని వెలిగించిన మనిషి ఆర్ముగ కుమార్. అతడికి ఎప్పటికీ రుణపడి ఉంటాను’ అని విజయ్ సేతుపతి అన్నారు.