Malvi Malhotra Reveals Yogesh Issue : తిరగబడరా సామి అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన మాల్వి మల్హోత్రా రాజ్ తరుణ్ ప్రియురాలు వల్ల అనుహ్యంగా వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అయితే నిజానికి ఆమె మీద 2020లో ఒక ఎటాక్ జరిగింది. యోగేష్ సింగ్ అనే ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆమె మీద మూడుసార్లు కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది ప్రస్తుతానికి యోగేష్ కటకటాల పాలై జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ కేసులో ఇంకా తీర్పు వెలవడలేదు. అయితే అసలు ఈ విషయంలో ఏం జరిగిందనే విషయం మీద తాజాగా ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాల్వి మలహోత్రా క్లారిటీ ఇచ్చింది. తాను ముంబైలో సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో యోగేష్ తనను కాంటాక్ట్ అయ్యాడని స్నేహ కక్కర్ స్టూడియోస్ కి సంబంధించి అతను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పని చేసేవాడని చెప్పుకొచ్చింది. కలిసి ఒక సాంగ్ చేయాల్సి ఉంది కానీ డేట్స్ కారణంతో చేయలేదు.
Kerala Landslide: టాలీవుడ్ నుంచి మొదటి విరాళం ప్రకటించిన నాగవంశీ
కొన్నాళ్ళకతను నన్ను ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. అసలు పరిచయమే లేదు ప్రేమ అనేది కరెక్ట్ కాదని నేను అతన్ని పంపేశాను. అయితే అతను నా వెనుక పడడం నేను గమనించాను. నాలుగైదు సార్లు అతను మా కారు వెనుక పడుతూ ఉండేవాడు. అక్టోబర్ 9 20 20వ సంవత్సరం నేను దుబాయి వెళ్లేందుకు సెలూన్ కి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో అతను మళ్లీ కనిపించాడు. అప్పుడే అతన్ని నేను బాగా మందలించాను. ఇంకోసారి నా వెంట పడితే పోలీసులకు పట్టిస్తానని హెచ్చరించాను. అయితే అప్పుడు అనుకోకుండా ఎప్పుడైనా నీ మొఖం చూసుకున్నావా అని అన్నాను. అలా అనడం తప్పని తర్వాత నా లాయర్ కూడా చెప్పారు. ఆలోచిస్తే నాకు కూడా నిజమే అనిపించింది. ఆ తర్వాత అతను నా మీద కత్తితో దాడి చేశాడు సీసీటీవీ ఫుటేజ్ తో పాటు ప్రత్యక్ష సాక్షులు కూడా ఉండడంతో కేసు చార్జ్ షీట్ బలంగా ఉంది కాబట్టే అతను ఇప్పటికీ బయటపడలేదు. కానీ ఈ లావణ్య వాళ్ళతో కూడా అలాంటి క్రిమినల్స్ తో కూడా సంప్రదింపులు జరుపుతోంది అని మాల్వి మల్హోత్రా చెప్పుకొచ్చింది.