మాళవిక మోహనన్ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ KV గుహన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, తన అందం, యాక్టింగ్ తో అలరించింది. కానీ సొంతగడ్డపై విజయాన్ని మాత్రం అందుకోలేకపోయిన మాళవిక, తమిళ్‌లో విజయ్ సరసన ‘మాస్టర్’ సినిమాతో ..ఎంట్రీ ఇచ్చి ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారింది. ఆ తర్వాత ధనుష్, విక్రమ్ సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు ‘ది రాజాసాబ్’ సినిమాతో మాళవిక తెలుగుకు పరిచయం కానుంది.
Also Read : Eega : ఈగ సినిమాకు కాపీ..? ‘లవ్లీ’ మూవీ టీమ్‌కి లీగల్ నోటీసులు !
ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి మాళవిక పేరు బాగానే వినిపిస్తోంది. ఇక ఎప్పుడైతే ఆమె సినిమాలో ఉంది అని తెలిసిందో ప్రభాస్ ఫ్యాన్స్.. ఆమెను ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. దీంతో నిత్యం హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాను హిట్టేక్కిస్తూ ఉంది. అయితే మాళవికకు చిన్నప్పటి నుంచి ఫిల్మ్ మేకింగ్ పట్ల ఆసక్తి ఉండేదట. ఆమె తండ్రి కె.యు. మోహనన్, దేశంలోని టాప్ సినిమాటోగ్రాఫర్ లో ఒకరు.
దీంతో తన తండ్రి అడుగుజాడల్లో నడవాలన్న కలతో మాళవిక కూడా డైరెక్షన్ లేదా సినిమాటోగ్రఫీ వైపు వెళ్లాలనుకుందట. అప్పట్లో కొన్ని మినీ ప్రాజెక్ట్స్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పని చేసిందట.కానీ ఓ అవకాశవశాత్తూ మోడలింగ్ లోకి అడుగుపెట్టిన మాళవిక, తనలో ఉన్న నటనాన్ని కూడా బయటకు తెచ్చింది.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ ‘అనుకోకుండానే కెమెరా ముందుకొచ్చాను. తెరముందు కనిపించడం కంటే నాకు తెరవెనక ప్రపంచమే ఇష్టం… అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే నేను దర్శకురాలినో లేదంటే నాన్న లాగా ఫోటోగ్రాఫర్‌ని అయ్యేదాన్నని’ అని చెపుకొచ్చింది.