దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సెన్సేషనల్ హిట్ ‘ఈగ’ ( 2012 )చిత్రం మరోసారి వార్తల్లోకి నిలిచింది. అప్పట్లో తన వినూత్న కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసిన ఈ సినిమా, ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశంగా మారింది. కారణం మలయాళ మూవీ ‘లవ్లీ’ పై కాపీరైట్ వివాదం. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై నిర్మితమైన ‘ఈగ’ చిత్ర నిర్మాతలు తాజాగా మలయాళ చిత్రం ‘లవ్లీ’ టీమ్‌కు లీగల్ నోటీసులు పంపారు. ఈ సినిమాలో కనిపించిన పలు అంశాలు, ముఖ్యంగా ఈగ క్యారెక్టర్ డిజైన్, దాని కదలికలు, రూపం ఇలా అన్నీ తమ సినిమాని కాపీ చేశారని వారు ఆరోపిస్తున్నారు.
Also Read : Shaktimaan : శక్తిమాన్‌లో అల్లు అర్జున్.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ బాసిల్ జోసెఫ్
కానీ ‘లవ్లీ’ చిత్ర బృందం మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. ‘మేము కథను పూర్తిగా స్వతంత్రంగా డిజైన్ చేశాం. మా వద్ద అన్ని కాన్సెప్ట్ డిజైనింగ్ ఆధారాలు ఉన్నాయి. ఇది ఏ విధంగా కాపీ కాదు’ అంటూ స్పందించారు. ఇక ఇప్పుడు ఈ వివాదం కోర్టు చుట్టూ తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సృష్టి కల్పన, కాపీరైట్ హక్కులు, క్యారెక్టర్ డిజైన్ వంటి అంశాల్లో న్యాయపరంగా ఏది నిలుస్తుందనేది తేలాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. మొత్తానికి రాజమౌళి ‘ఈగ’ సినిమాతో చూపించిన విజువల్ మ్యాజిక్ ఇప్పటికీ మల్టీ ఇండస్ట్రీలకు స్ఫూర్తిగా నిలుస్తున్నట్టు ఈ వివాదం చెబుతోంది. 13 ఏళ్ళ తరువాత కూడా ‘ఈగ’ ట్రెండ్ రీడిజైన్ చేస్తుండటం విశేషం.
ఇక ‘లవ్లీ’ సినిమా కథ విషయానికి.. వస్తే ఓ యువకుడు మరణించిన తర్వాత ఈగగా పునర్జన్మ పొంది ప్రతీకారం తీర్చుకుంటాడు. అందుకే ఈ కథాకథన శైలి, వీఎఫ్‌ఎక్స్ డిజైన్, టీజర్ లుక్స్ అన్నీ ‘ఈగ’ సినిమా గుర్తు చేస్తుండటంతో ఈ వివాదం రాజుకుంది. ప్రచార చిత్రాల్లో కూడా ఈగ లాంటి క్యారెక్టర్‌ను చూపించడం పట్ల నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.