మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ కానీ, ఇతర వివరాలు కానీ వెల్లడించలేదు. ఈ మధ్యనే మేము ఎక్స్‌క్లూజివ్‌గా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఈవెంట్ నవంబర్ 15వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించబోతున్నామని వెల్లడించిన సంగతి తెలిసింది. ఇప్పుడు ఆ ఈవెంట్‌కు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. అదేంటంటే, ఈ నవంబర్ 15వ తారీఖున ఒక భారీ గ్లిమ్స్ రిలీజ్ చేయబోతున్నారని, అందులోనే టైటిల్ కూడా రివీల్ చేయబోతున్నారని తెలుస్తోంది.
Also Read :JD Vance: భార్య మతంపై జేడీ వాన్స్ మరోసారి కీలక ప్రకటన
రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకి టైటిల్‌గా ఇప్పటికే పలు ప్రచారాలు తెరమీదకు వచ్చాయి. కానీ, ఫైనల్ టైటిల్ ఏమిటనేది రాజమౌళి 15వ తారీఖున క్లారిటీ ఇవ్వబోతున్నారు. కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ సహా ప్రియాంక చోప్రా కీలక పాత్రలలో నటిస్తున్నారని క్లారిటీ వచ్చింది. అయితే, ప్రియాంక చేసేది మాత్రం హీరోయిన్ రోల్ కాదు. కాబట్టి, హీరోయిన్గా ఎవరిని తీసుకుంటారు అని చర్చ జరుగుతోంది. ఇది ఒక ఫారెస్ట్ అడ్వెంచర్ స్టోరీ అనే ప్రచారం అయితే ముందు నుంచి ఉంది. కానీ, ఎలాంటి సినిమా అనేది మాత్రం రిలీజ్ అయ్యాక మాత్రమే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.