ప్రిన్స్ మహేశ్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ గత యేడాది సంక్రాంతి కానుకగా విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ఆ సినిమా కోసం దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలన్నీ సూపర్ హిట్. అందులో ‘మైండ్ బ్లాక్’ సాంగ్ స్పెషల్ నంబర్ అని చెప్పాలి. మహేశ్ తో లుంగీ కట్టించి మరీ ఈ సాంగ్ లో దర్శకుడు అనిల్ రావిపూడి ఎంట్రీ ఇప్పించాడు. అలానే రష్మికా మండణ్ణ సూపర్ మాస్ స్టెప్టులతో అలరించింది. సెట్స్ సైతం కనుల విందుగా ఉంటాయి. అందుకే ఈ పాటకు యూట్యూబ్ లో వంద మిలియన్ వ్యూస్ దక్కాయి. మరి రాబోయే రోజుల్లో మరెన్ని మైలు రాళ్లను ఈ సాంగ్ దాటుతుందో చూడాలి.