MM Keeravani: బాబు సినిమా కోసం ఇంత టైమ్ ఎందుకు స్వామి?.. ‘వారణాసి’ రీ రికార్డింగ్‌పై కీరవాణి కీలక నిర్ణయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MM Keeravani: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వారణాసి’పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రతి అప్డేట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ వర్క్‌పై ఓ ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (రీ రికార్డింగ్) కోసం సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. సాధారణంగా పెద్ద సినిమాలకు కూడా రెండు, మూడు నెలల్లో రీ రికార్డింగ్ పూర్తి చేసే కీరవాణి.. ‘వారణాసి’ కోసం ఏకంగా ఐదు నెలల సమయం తీసుకుంటున్నట్లు సమాచారం. అవసరమైతే ఆరు నెలల వరకు సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన సినిమాలకు కూడా తక్కువ సమయంలో బీజీఎం అందించే కీరవాణి.. ‘వారణాసి’ విషయంలో మరింత ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. రాజమౌళి-కీరవాణి కాంబినేషన్ తొలిసారి పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో మ్యూజిక్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ‘వారణాసి’ థీమ్ మ్యూజిక్‌తో కీరవాణి తన మార్క్ చూపించగా.. పూర్తి స్థాయి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం మరింత కేర్ తీసుకుంటున్నట్లు సమాచారం. మరోవైపు సినిమా షూటింగ్ అక్టోబర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని, సెప్టెంబర్ నుంచి మ్యూజిక్ పనులు ప్రారంభించి జనవరి వరకు పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు కీరవాణి గతంలో వెల్లడించారు. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.
Also Read
- Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Nayanathra : వయసుతో పనేముంది? కుర్ర హీరోతో లేడీ సూపర్ స్టార్ రొమాన్స్.. ఓటీటీలోకి వచ్చేసిన 'హాయ్'!
- TV Nandi Awards: తిరుపతి వేదికగా 'నంది' అవార్డుల వేడుక.. పరభాషా నటులపై ఆంక్షలు?
- Mamitha Baiju : మమితా బైజు కోరిక తీరేదెన్నడు?
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!