High Court: రివ్యూ బ్యాన్ కేసు.. నిర్మాతలకు కోర్టు షాక్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏదైనా సినిమా విడుదలైన 3 రోజుల తర్వాత సినిమా రివ్యూలు విడుదల చేయాలని తమిళ నిర్మాతల సంఘం తరపున కేసు వేయగా.. కోర్టు దానిని కొట్టిపారేసింది. సినిమా విజయానికి కథ ఎంత ముఖ్యమైనదో? ఇప్పుడు రివ్యూలు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలు, ప్రముఖ నటీనటులు నటించిన సినిమాలు కూడా రివ్యూలు కారణంగా ప్రేక్షకులకు చేరువవుతుండగా, చిన్న బడ్జెట్ సినిమాలు మాత్రం రివ్యూల ద్వారానే ముందుకు వెళ్తున్నాయి. బ్లూ స్టార్, లబ్బర్ బంధు, లవర్ వంటి చిత్రాలే దీనికి పెద్ద ఉదాహరణ. గతంలో జర్నలిస్టులు మాత్రమే సినిమాలను సమీక్షించేవారు. అయితే యూట్యూబ్ కల్చర్ వచ్చిన తరువాత ఫోన్ ఉన్నవాళ్లంతా క్రిటిక్స్ అయిపోయారు. ఫేస్బుక్, ట్విటర్, ద్వారా కొందరు తమ రివ్యూలు ఇస్తున్నారు.
South Korea: దక్షిణ కొరియాలో “ఎమర్జెన్సీ” విధింపు.. నార్త్ కొరియా మద్దతుదారులే టార్గెట్..
Also Read
ఇలాంటి రివ్యూల వల్ల భారతీయుడు 2, కంగువ, వంటి భారీ బడ్జెట్ చిత్రాలు నెగిటివ్ రివ్యూలు రావడంతో అభిమానులకు చేరువకాలేదని ఒక పక్షం అంటుంటే, విమర్శలు వచ్చినా అభిమానులు ఎన్నో సినిమాలను సక్సెస్ చేశారని మరో పక్షం అంటోంది. ఈ విషయంలో తీవ్ర సంప్రదింపుల అనంతరం ప్రస్తుత సినీ నిర్మాతల సంఘం.. థియేటర్ యాజమాన్యాలతో మాట్లాడి ఓ నిర్ధారణకు వచ్చింది. దీని ప్రకారం, సినిమా గురించి తమ అభిప్రాయాన్ని అడగడానికి థియేటర్లలోకి ఎవరినీ అనుమతించకూడదు, సినిమా విడుదలైన 3 రోజుల తర్వాత మాత్రమే అలా చేయడానికి వీలు కల్పించాలని వారు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసు ఈరోజు విచారణకు రాగా.. దానిని విచారించిన న్యాయస్థానం.. ‘‘సినిమాలు విడుదలైన మూడు రోజుల పాటు రివ్యూల ప్రచురణపై నిషేధం విధించేందుకు నిరాకరించింది. న్యాయమూర్తి సౌందర్.. విమర్శకుల విమర్శ అనేది భావప్రకటనా స్వేచ్ఛ, సాధారణంగా ఏ విధమైన ఆదేశాన్ని జారీ చేయలేమని పేర్కొన్నారు
తాజావార్తలు
-
Cyclone Arnab: కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులు, బాధితులతో ముఖాముఖి!
-
How to Make Besan at Home: ఇక మార్కెట్లో కొనాల్సిన పనిలేదు.. ఇంట్లోనే స్వచ్ఛమైన శనగపిండి తయారు చేసుకోండిలా..
-
Apple మొట్టమొదటిసారిగా టచ్స్క్రీన్ సదుపాయం.. PROLED XDR డిస్ప్లే, M5 ప్రాసెసర్లతో MacBook Pro లాంచ్..
-
Less Oil Cooking: తక్కువ నూనెతో రుచికరమైన వంటలు.. అడుగు అంటకుండా ఉండే స్మార్ట్ చిట్కాలు ఇవే..
-
iQOO Neo 12: 9000mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లేతో.. iQOO Neo 12 పవర్ఫుల్ గేమింగ్ ఫోన్ లాంచ్!
ట్రెండింగ్
-
9,020 mAh బ్యాటరీ, స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 2.3K 165Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ iQOO Pad Pro లాంచ్..!
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..