టాలీవుడ్ లో ఓ యంగ్ హీరో ఇండస్ట్రీలో అడగుపెట్టి చాలా ఏళ్ళు గడిచిపోయాయి. మొదట్లో విలన్ రోల్స్ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు, స్టార్ హీరోలకు తమ్ముడిగా పలు సినిమాల్లో కనిపించి మెప్పించాడు. ఆ తర్వాత హీరోగా మారి కెరీర్ స్టార్టింగ్ లో వైవిధ్య భరితమైన సినిమాలు చేస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ ఏర్పరుచుకున్నాడు. కానీ ఇప్పటికీ మిడ్ రేంజ్ హీరో దగ్గరే ఆలా ఉండిపోయాడు. ఆటను ఎవరో కాదు శర్వానంద్.
Also Read : Victory Venkatesh : వెంకీ మామయ్య సందడే సందడి.. స్పెషల్ వీడియో చూసారా..
ఇప్పటి వరకు 35 సినిమాలల్లో నటించాడు శర్వా. హిట్టు సినిమాలు ఎన్ని అంటే వేళ్ళ మీద లెక్కపెట్టొచ్జు. హిట్టు పర్సెంటేజ్ చాలా తక్కువ. డిఫ్రెంట్ సినిమాలు చేస్తాడని పేరుంది. కానీ అది మాత్రం చాలదు హిట్లు పడాలి కలెక్షన్లు రాబట్టాలి మార్కెట్ పెంచుకోవాలి. శర్వా లాస్ట్ హిట్ మహానుభావుడు. 2017లో వచ్చిన ఈ సినిమా సూపర్ కలెక్షన్స్ రాబట్టింది. ఆ తర్వాత ఈ యంగ్ హీరో హిట్టు అనే మాట వినలేదు. దాదాపు 7 ఏళ్ళు కావొస్తుంది శర్వా సరైన హిట్టు కొట్టి. ఈ గ్యాప్ లో దాదాపు 8 సినిమాలు రిలీజ్ చేసాడు. వాటిలో ‘ఒకే ఓకే జీవితం’ మాత్రమే ఓ మోస్తారు హిట్. మిలిగినవన్నీ వేటికవే డిజాస్టర్స్ గా నిలిచాయి. అన్ని రకాల పాత్రలు చేయగల క్యాపబిలిటీ ఉండి కూడా రేస్ లో వెనకబడ్డాడు శర్వా. తాజాగా మరో రెండు సినిమాలు ప్రకటించాడు శర్వా. ఇటీవల సమజవరగమన తో సూపర్ హిట్ అందిచిన దర్శకుడు రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటించబోతున్నాడు శర్వా, అలాగే అభిలాష్ డైరెక్షన్ లో నటిస్తున్నాడు. ఈ రెండింటితో హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ లోకి రావాలని ఆశిద్దాం.