కోలీవుడ్ లో మరో సంచలన కాంబో రెడీ అవుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్, ఉలగనాయగన్ కమల్ హాసన్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతోంది. ఇప్పుడు ఈ వ్యవహారం కోలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుండి ఈ ఇద్దరు స్టార్స్ నువ్వా నేనా అని పోటీపడిన సూపర్ స్టార్ రజనీ, కమల్ హాసన్ ఇప్పుడు ఒకే సినిమాలో కనిపిస్తున్నారు. ఈ ఇద్దరూ కలిపి ఓ భారీ యాక్షన్ సినిమా చేస్తున్నారు. ఈ విషయాన్నీ స్వయంగా కమల్ హాసన్ దుబాయ్ లో జరిగిన సైమా అవార్డ్ కార్యక్రమంలో కన్ఫామ్ చేసాడు.
Also Read : Bollywood : ఆషీకీ 2 డైరెక్టర్ తో గొడవ.. ఛావా దర్శకుడికి గ్రీన్ సిగ్నల్
అయితే ఈ సినిమాను తమిళ స్టార్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేస్తాడని వార్తలు వచ్చాయి. కానీ అది వాస్తవం కాదని తమిళ మీడియా సమాచారం. లోకేష్ కనకరాజ్ ఈ సినిమాకు కథ మాత్రమే అందించబోతున్నాడట. లోకేష్ కథతో తమిళ యంగ్ హీరో కమ్ డైరెక్టర్ ప్రదీప్ రంగరనాధ్ దర్శకత్వంలో రజనీకాంత్ – కమల్ హాసన్ నటించబోతున్నారట. ప్రస్తుతం ప్రదీప్ రంగనాథ్ హీరోగా లవ్ ఇన్సూరెన్స్ కంపేని, డ్యూడ్ సినిమాలను ఫినిష్ చేసేసాడు. దీపావళికి ఈ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. హీరోగా మరే ఇతర సినిమాలకు సంతకం చేయలేదు. ఈ నేపథ్యంలో ప్రదీప్ కు దర్శకత్వ భాద్యతలు అప్పగించాలని భావిస్తున్నారట లోకేష్. అటు లోకేశ్ కనకరాజ్ కూడా తన నెక్ట్స్ సినిమాగా కార్తీ తో ఖైదీ -2 ను సెట్స్ పైకి తీసుకువెళ్లేందుకు రెడీ అవుతున్నాడట. అలాగే లోకేష్ కనకరాజ్ హీరోగా కూడా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మరి కేవలం రెండు సినిమాలను డైరెక్ట్ చేసిన ప్రదీప్ రంగనాథ్ తమిళ స్టార్ హీరోలైన రజనీకాంత్ – కమల్ హాసన్ ను డైరెక్ట్ చేయగలడా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.