లోకేశ్ సినిమాటిక్ యూనివర్శ్ నుండి ఇప్పటి వరకు త్రీ మూవీస్ వచ్చాయి. ఖైదీ, విక్రమ్, లియో ఈ మూడింటికీ లోకేశ్ కనగరాజే దర్శకుడు. ఆల్మోస్ట్ స్టోరీలన్నీ ఆయనవే. కానీ ఫోర్త్ ఇన్‌స్టాల్ మెంట్ మూవీ బెంజ్‌లో కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడు లోకీ. రోమియో అండ్ సుల్తాన్ ఫేం బక్కియరాజ్ కన్నన్‌కు బెంజ్‌ను డీల్ చేసే బాధ్యతలు అప్పగించాడు. రాఘవ లారెన్స్ హీరోగా వస్తోన్న ఈ ప్రాజెక్టుకు లోకీ స్టోరీ ఇవ్వడంతో పాటు.. ప్రజెంటర్‌గా వ్యవహరిస్తున్నాడు.
Also Read : VISHAL : హీరో విశాల్ హెల్త్ అప్డేట్.. ఇప్పుడెలా ఉందంటే.?
బెంజ్ ఎనౌన్స్ చేసి సిక్స్ మంత్స్ దాటింది. కానీ కూలీ ప్రాజెక్టులో బిజీగా ఉన్న నేపథ్యంలో లోకేష్ కనకరాజ్ బెంజ్ కథకు మెరుగులు దిద్దలేదని తెలుస్తోంది. ఇక ఇప్పుడు అన్నీసెట్ అవడంతో బెంజ్ ను స్టార్ట్ చేసాడు లోకి. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం నేడు ఈ సినిమాను అధికారకంగా స్టార్ట్ చేసారు. నేడు చెన్నై లో షూటింగ్ మొదలు పెట్టారు. బెంజ్‌లో లారెన్స్‌తో పాటు సీనియర్ హీరో మాధవన్, అలాగే మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలీ మెయిన్ లీడ్స్‌గా కనిపించబోతున్నారు. కోలీవుడ్ భామ ప్రియా మోహన్ హీరోయిన్‌గా నటించబోతుంది. బెంజ్ అవుట్ పుట్ మరింత వయెలెంట్‌గా కథ నేపథ్యంలో రానుంది. ఇక ఈ సినిమాకు తమిళ్ నయా మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ బాణీలు సమకూరుస్తున్నారు. దీని తర్వాత ఖైదీ2ని పట్టాలెక్కించనున్నాడు లోకీ. మరీ బెంజ్ కోసం రోలక్స్ తరహా రోల్ రీ క్రియేట్ చేశాడో, కొత్త క్యారెక్టర్ డిజైన్ చేశాడో చూడాలి.