అమలా పాల్, రాహుల్ విజయ్ జంటగా నటించిన టైం లూప్ థ్రిల్లర్ “కుడి ఎడమైతే”. ‘యు టర్న్’ ఫేమ్ పవన్ కుమార్ ఈ సరికొత్త సిరీస్ కు దర్శకత్వం వహించారు. జూలై 16 నుండి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. అమలాపాల్ ఈ వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇస్తోంది. తాజాగా టైమ్ లూప్ డ్రామా అయిన ఈ సిరీస్ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ చూస్తుంటే గ్రిప్పింగ్ కథతో దర్శకుడు ఈ సిరీస్ ను తెరకెక్కించినట్టు అన్పిస్తుంది.
Read Also : ఓటిటిలో స్టార్ గా మారిన “పుష్ప” విలన్
అమలా పాల్ తన కెరీర్, వ్యక్తిగత జీవితంలో ఊహించని మలుపులు ఎదుర్కొంటున్న కఠినమైన పోలీసు అధికారిగా నటించింది. తన జీవితంలో జరిగిందే మళ్ళీ మళ్ళీ జరుగుతుంది. ఆమెలాగే మరో వ్యక్తికీ కూడా జరుగుతుంది. వీరిద్దరూ టైం లూప్ లో ఇరుక్కుంటారు. ఓ యాక్సిడెంట్ లో చనిపోయిన అమ్మాయికి, వీళ్లిద్దరికీ సంబంధం ఏమిటి ? వాళ్ళు ఆ సమస్యను ఎలా పరిష్కరించారు ? అనే ఆసక్తిని రేకెత్తిస్తోంది ట్రైలర్. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.